38.2 C
Hyderabad
May 3, 2024 20: 11 PM
Slider ముఖ్యంశాలు

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది కీ వెల్లడి

#TSPSC

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది కీ వెల్లడైంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.ప్రిలిమ్స్‌లో ఎనిమిది ప్రశ్నలను తొలగించిన కమిషన్‌ రెండు ప్రశ్నల సమాధానాలను మార్చింది. తొలగించిన ప్రశ్నలు మాస్టర్‌ ప్రశ్నపత్రం ప్రకారం 3, 4, 5, 46, 54, 114, 128, 135గా ఉన్నాయి. 38వ ప్రశ్నకు ప్రాథమిక కీలో సమాధానం 3 ఉండగా తుది కీలో సమాధానం 2గా మారింది. అలాగే… 59వ ప్రశ్నకు సరైన జవాబును 1 నుంచి 3గా మారింది.

జూన్‌ 11న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థుల ఓఎంఆర్‌ పత్రాల స్కానింగ్‌ ప్రకారం ఈ వివరాలను తాజాగా వెల్లడించింది. ప్రిలిమ్స్‌ కీని జూన్‌ 28న విడుదల చేసిన కమిషన్‌ జులై 1 నుంచి 5 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఇలా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ తుది కీని విడుదల చేసింది. ఈ కమిటీ నివేదికను కమిషన్‌ ఆమోదించింది. ఫైనల్‌ కీలో భవిష్యత్తులో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని, ఎలాంటి అభ్యంతరాలనూ పరిగణనలోకి తీసుకోబోమంది.

ప్రిలిమ్స్‌లో ఎనిమిది ప్రశ్నలను తొలగించినందున ప్రస్తుతం 142 ప్రశ్నలే మిగిలాయి. వీటికి వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుని 150 మార్కులకు దామాషా పద్ధతిలో లెక్కిస్తారు. నోటిఫికేషన్‌లోని పేరా నంబరు 8(4) ప్రకారం… ఏమైనా ప్రశ్నలను తొలగించినప్పుడు, వాటిని మినహాయించగా మిగతా ప్రశ్నలకు అభ్యర్థి సాధించిన మార్కులనే మొత్తం మార్కుల కింద గణిస్తారు. వీటిని లెక్కించేప్పుడు మూడో డెసిమల్‌ పాయింట్‌ వరకు పరిగణనలోకి తీసుకుంటారు.

ఉదాహరణకు ఒక అభ్యర్థికి 120 మార్కులు వచ్చాయనుకుందాం. ఎనిమిది ప్రశ్నలు తొలగించినందున, మిగిలిన 142 ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున మొత్తం 142 మార్కులకు 120 వచ్చినట్లు అవుతుంది. తుది మెరిట్‌ను దామాషా పద్ధతిన 150 మార్కులకు లెక్కిస్తారు. అంటే… అభ్యర్థికి 142 మార్కులకు 120 మార్కులు వచ్చాయి. ఈలెక్కన 150 మార్కులకు సాధించిన స్కోరు 150/142×120 = 126.760. అంటే ప్రిలిమ్స్‌లో అభ్యర్థి మార్కులు 126.760 అవుతాయి. ఈ లెక్కన ప్రతి అభ్యర్థి మార్కులను మూడు డెసిమల్స్‌ వరకు తీసుకొని తుది మెరిట్‌ జాబితాను కమిషన్‌ రూపొందిస్తుంది.

Related posts

ఒంగోలు సభ చూసి డిప్రెషన్ లోకి వెళ్లొద్దు

Satyam NEWS

తెదేపా అధ్యక్షులు నారా చంద్రబాబు ను కలిసిన ఎస్కే సత్తార్

Satyam NEWS

మతి భ్రమించి మాట్లాడుతున్న రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

Leave a Comment