41.2 C
Hyderabad
May 4, 2024 18: 19 PM
Slider జాతీయం

వస్త్రాలపై జీఎస్ టీ పెంపు: వెనక్కు తగిన కేంద్రం

#nirmalaseetaraman

వస్త్రాలపై వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) పెంపుపై దేశవ్యాప్తంగా చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్త్ర వ్యాపారుల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జీఎస్‌టీ కౌన్సిల్ వెనక్కి తగ్గింది. జనవరి 1 నుంచి జీఎస్‌టీ పెంపు అమలును జీఎస్‌టీ కౌన్సిల్ బుధవారంనాడు ఏకగ్రీవంగా వాయిదా వేసింది. ప్రస్తుతం టెక్స్‌టైక్స్‌పై ఉన్న 5 శాతం జీఎస్‌టీని 12 శాతానికి పెంచుతూ గత కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.

శుక్రవారంనాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన 46వ జీఎస్‌టీ కౌన్సిల్ దీనిపై చర్చించి జీఎస్‌టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. 2020 ఫిబ్రవరిలో జరిగే తదుపరి సమావేశంలో ఈ అంశాన్ని సమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. సమావేశం నిర్ణయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పాత్రికేయుల సమావేశంలో నిర్మలా సీతారామన్ ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు, వస్త్రాలపై జీఎస్‌టీ పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పటికే గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాలు ప్రకటించాయి. గుజరాత్‌లోని సూరత్‌లో వస్త్ర వ్యాపారులు, నేత కార్మికులు బంద్‌ పాటించారు.

Related posts

తెలంగాణ ను దోపిడి చేసేందుకు మళ్లీ సిద్ధమౌతున్న దొంగలు

Satyam NEWS

పవిత్ర రంజాన్ ఇంటి వద్దనే జరుపుకోవాలి

Satyam NEWS

కర్నూలు జిల్లాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం

Satyam NEWS

Leave a Comment