28.7 C
Hyderabad
May 6, 2024 02: 52 AM
Slider విజయనగరం

కొత్త సంవత్సరానికి బోకేలు..మొక్కలు తేవొద్దు…!

#suryakumariias

జిల్లా కలెక్టర్ సూర్యకుమారి నూతన సంవత్సర శుభాకాంక్షలు

విజయనగరం జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022వ సంవత్సరం జిల్లా ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్షు, ఆనందాన్ని కలుగజేయాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. జిల్లా అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్థి ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంతో కొత్త ఏడాది జిల్లా అభివృద్ధిని మలుపు తిప్పే సంవత్సరంగా రూపొందబోతున్నదని పేర్కోన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే దిశగా ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు సత్ఫలితాలు సాధించి అందరి జీవితాల్లో కొత్త ఏడాది నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలకు కరోనా బాధల నుంచి ఈ ఏడాది విముక్తి కలగాలని ప్రార్థించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు.

సంద‌ర్శ‌కుల‌కు గ‌మ‌నిక‌

పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొనే నిమిత్తం జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు క్షేత్ర స్థాయి పర్య‌ట‌న‌లో ఉంటారు. మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌ నుంచి ఆమె త‌న క్యాంపు కార్యాల‌యంలో అందుబాటులో ఉంటారు. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేయాల‌నుకొనే ఉద్యోగులు, సిబ్బంది స్థానిక క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లాల్సిందిగా జిల్లా రెవెన్యూ అధికారి ద్వారా తెలిపారు. సంద‌ర్శ‌కులు పూల బొకేలు, మొక్క‌లు తీసుకురావొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇవ్వాల‌నుకొంటే నోట్ పుస్త‌కాలు అంద‌జేయ‌వ‌చ్చ‌ని సూచించారు.

Related posts

స్పెషల్ కోర్ట్ :దేవీందర్‌ సింగ్‌కు 15 రోజుల రిమాండ్

Satyam NEWS

మాల నాగరాజును హత్యచేసిన దుండగులను ఉరితీయాలి

Satyam NEWS

కేసీఆర్ ఒక అసమర్థ ముఖ్యమంత్రి: అరుణ

Bhavani

Leave a Comment