40.2 C
Hyderabad
May 2, 2024 16: 27 PM
Slider గుంటూరు

పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు రోటరీ సంస్థ కే సాధ్యం

#NRTMLASrinivasareddy

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో బుధవారం జెడ్.పి.హై స్కూల్ లో రోటరీ క్లబ్ ఆఫ్ నరసరావుపేట, రోటరీ మెట్రోపొలిటీన్ సమ్మన్నాహ, రోటరీ సైమన్స్ ఐలాండ్ క్లబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో  రోటరీ ఫౌండేషన్ గ్లోబల్ గ్రాంట్ సహకారంతో హ్యాపీ స్కూల్స్ ప్రాజెక్ట్ లో భాగంగా 10 లక్షలు విలువ చేసే టాయిలెట్ బ్లాక్స్, యూరినల్స్, ఆర్.ఓ.వాటర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ ను ప్రారంభించారు.

కోటప్పకొండ గ్రామం లోని జడ్.పి.హై స్కూల్ లో 8.5 లక్షల విలువ చేసే టాయిలెట్ బ్లాక్స్, యూరినల్స్, 140 స్కూల్ బెంచీలు బహుకరించారు.

ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిలుగా స్థానిక శాసన సభ్యులు రోటరియన్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనువాస రెడ్డి, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడ్లమాని రవి, డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని తాళ్ల రాజశేఖర్ రెడ్డి,రోటరీ ఫౌండేషన్ చైర్మన్ అన్నే రత్న ప్రభాకర్ లు విచ్చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసిరెడ్డి మాట్లాడుతూ రోటరీ హ్యాపీ స్కూల్స్ లో భాగంగా 48 లక్షల రూపాయలతో నరసరావుపేట లోని తొమ్మిది స్కూల్స్ లో హ్యాపీ స్కూల్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారని, అలానే 26 లక్షల రూపాయల వ్యయంతో పట్టణ నడి బొడ్డున గడియారం స్తంభం నిర్మిస్తున్నారని అన్నారు.

అలానే గవర్నమెంట్ హాస్పిటల్ లో 40 లక్షల రూపాయల వ్యయంతో డయాలసిస్ యూనిట్ మరియు అత్యాధునిక ఎక్విప్మెంట్ తో పరికరాలు ఇస్తునారని మరి కొద్ది రోజుల్లో గాంధీ పార్క్ ని కూడా 20 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తామన్నారు.

ఇలాంటి అభివృద్ధి పనులు ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలు సమర్ధవంతంగా ఒక్క రోటరీ మాత్రమే చేయగలుగుతుందని కొనియాడారు. రోటరీ సంస్థను అభినందిస్తూ ఈ రోజు నిర్మించిన టాయిలెట్ బ్లాక్స్ , పిల్లలందరు మంచినీరు తాగాలని సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ని కూడా ఓపెన్ చేసారని విద్యార్థిని విద్యార్థులందరు వీటిని శుభ్రంగా ఉపయోగించుకొని చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని తెలియజేసారు.

నాడు – నేడు కార్యక్రమంలో కూడా స్కూల్స్ లో సదుపాయాలు

అలానే గవర్నమెంట్ వారు నిర్వహించే నాడు – నేడు కార్యక్రమంలో కూడా స్కూల్స్ లో మంచి సదుపాయాలు కలిగిస్తున్నామని ప్రైవేట్ స్కూల్స్ కన్నా అధిక శాతం మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ లొనే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారని తెలిపారు.

రోటరీ వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని అభినందిస్తూ యల్లమంద కోటప్పకొండ స్కూల్స్ నందు మాచింగ్ గ్రాంట్ ఫండ్ ను కొంత వసూలు చేసి రోటరీ క్లబ్ వారికి అందించి ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన స్కూల్ పేరెంట్ కమిటీ సభ్యులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పొట్టి శశి భూషణ్ కార్యదర్శి వనమా పవన్ కుమార్, స్కూల్ హెడ్ మాస్టర్లు ఎర్రం హనుమంతరావు, కృష్ణ నాయక్, ప్రాజెక్ట్ కమిటీ చైర్మెన్స్ జమ్ముల రాధాకృష్ణ, మేల్లచేరువు సుమిత్ర కుమార్, కె.వి.ఆంజనేయులు,

కపలవాయి రమేష్ చంద్ర దత్తు, రాయల శ్రీనివాసరావు, పాశం కృష్ణారావు, యస్ కె.జిలానీ మాలిక్, మురారిశెట్టి వెంకటేశ్వర రావు, స్కూల్ అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు రోటరాక్ట్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆ ఘనత ఎన్టీఆర్ కే చెల్లింది!!

Satyam NEWS

హోంగార్డు అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్

Murali Krishna

బస్తీ దావాఖన ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Bhavani

Leave a Comment