Slider జాతీయం

హరాస్మెంట్:రిపోర్టర్,వార్డ్ మెంబెర్ వేధింపులతో ఆత్మహత్య

harrasment reporter eo

పత్రిక విలేకరి, గ్రామ పంచాయితీ సభ్యుడి లైంగిక వేధింపులకు తట్టుకోలేక ఒక లేడీ ఆఫీసర్ మరణించిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది`. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలోని భారతీనగర్‌ లో గ్రామ పంచాయితీ ఆఫీసర్ గా అనితా రాజేశ్వరి పనిచేస్తుండగా గత సంవత్సర కాలం గా ఓ వారపత్రిక విలేకరి, మరో సహోద్యోగి ఆమెను వేధిస్తున్నారు.

అక్కడే రూరల్ పోలీసు స్టేషన్ లో అనితా రాజేశ్వరి తల్లి ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తుండగా విషయం ఆమెతో చెప్పింది. ఆమె వారిని పిలిపించి వేధింపులు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించినా వారి వైఖరి మారలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనితా రాజేశ్వరి మంగళవారం నాడు తన కార్యాలయంలోనే విషం తాగింది. విషయాన్ని గుర్తించిన తోటి సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసును రిజిస్టర్ చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

Related posts

అర్చకులకు తీపికబురు: గౌర‌వ వేతనం రూ. 10 వేల‌కు పెంపు

mamatha

కోవిడ్  బాధితులకు  వైద్యం చేయం అని బోర్డ్ పెట్టడం సరికాదు

Satyam NEWS

మేడారం మినీ జాతరలో సెల్ ఫోన్ దొంగల చేతివాటం

Satyam NEWS

Leave a Comment