27.7 C
Hyderabad
May 12, 2024 04: 34 AM
Slider విజయనగరం

అగ్ని సాక్షి గా పెళ్లాడిన  భార్యకు నరకం… పుష్కర కాలం పాటు గదిలోనే…

#advocate

వెలుగులో కి వచ్చిన విజయనగరం లో న్యాయ వాది  భాగోతం..!

విద్యలనగరమైన విజయనగరం లో ఓ విద్యావంతురాలైన ఇల్లాలు 13 ఏళ్లుగా గదిలో బంధింపబడ్డ వైనం… మీరు చదవబోతోంది. విజయనగరం బాలాజీ కాంప్లెక్స్ వద్ద..ముగ్గురు పిల్లల తల్లి సాయి సుప్రియను..న్యాయ వాదిగా చెప్పుకుంటున్న మధుసూధన్…అగ్ని సాక్షి గా తాళి కట్టిన భార్య కు ముగ్గురు పిల్లలు పుట్టి..ప్రస్తుతం వాళ్లంతా…పదేళ్లు పైబడిన..13 ఏళ్లుగా భార్య కు బాహ్య ప్రపంచం ఏంటో తెలియనివ్వలేదు…భర్త ,అత్త.

ఇన్నేళ్ళ తర్వాత కన్నవారి ఫిర్యాదు తో ఇల్లాలు నరకకూపం నుంచీ బయటపడగా..జడ్జి ఆదేశాలతో విశాఖలోని మధుర వాడలో కన్నవారింట్లో ఉండాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే… పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉన్న ఓ న్యాయవాది ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. తన తల్లి సోదరుడు మాటలు విని ఏకంగా 11 సంవత్సరాల పాటు తాళి కట్టిన భార్యను ఇంట్లో బంధించి బయట ప్రపంచానికి దూరం చేశాడు. చీకటి గదిలో బక్క చిక్కిన శరీరంతో 11 సంవత్సరాల పాటు కఠినాతి కఠినమైన జీవితాన్ని అనుభవించింది.

తన న్యాయవాద వృత్తిని అడ్డం పెట్టుకొని బయట ప్రపంచానికి, తల్లిదండ్రులకు దూరం చేసిన ప్రబుద్ధుడు గోదావరి మధుసూదన్… శ్రీ సత్య సాయి పుట్టపర్తి  జిల్లాకు చెందిన సాయి సుప్రియ ను. పెళ్లి చేసుకున్నాడు. విజయనగరం  కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్ తో 2008లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం కలిగిన అనంతరం న్యాయవాది మధుసూదన్ తన తల్లి గోదావరి ఉమామహేశ్వరి తో పాటు తన తమ్ముడు మాటలు విని కట్టుకున్న భార్యను బయట ప్రపంచానికి దూరం చేస్తూ చీకటి గదిలో 11 ఏళ్ల పాటు బంధించాడు.

బాధితురాలు కుటుంబ సభ్యులు ఎన్ని మార్లు అడిగిన న్యాయవాది తన వృత్తిని అడ్డం పెట్టుకొని బాధితురాలు కుటుంబ సభ్యులను బెదిరించేవాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సహనం కోల్పోయిన బాధితురాలు కన్నవారు  జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వన్ టౌన్ పోలీసులు  గోదావరి మధుసూదన్ ఇంటికి వెళ్ళగా మా ఇంటిని తనిఖీ చేసే అధికారం మీకు లేదు, తనిఖీ చేసేందుకు కోర్టు ఆదేశాలు ఏమైనా ఉన్నాయని పోలీసులు ఎదురు ప్రశ్నించడంతో పోలీసులు, బాధితురాలు తల్లిదండ్రులు న్యాయస్థానం ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకువచ్చారు.

సెర్చ్ వారెంట్తో  పోలీసులు న్యాయవాది మధుసూదన్ ఇంటిని తనిఖీ చేయగా సాయి ప్రియ బక్క చిక్కిన శరీరంతో చీకటి గదిలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఓ మూలన కనిపించింది. దీంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకువచ్చి కోర్ట్ లో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులపై చర్యలు తీసుకుంటామని  వన్ టౌన్  సీఐ డా. వెంకటరావు తెలిపారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

నాణ్యత కరువైన వేములవాడ రాజన్న లడ్డు

Satyam NEWS

లక్కీ ఛాన్స్: రాజ్యసభకు జగన్ అభ్యర్ధుల ఎంపిక కసరత్తు పూర్తి

Satyam NEWS

టీడీపీలో చేరిన సీనియర్ నాయకుడు నాగరాజు

Bhavani

Leave a Comment