21.2 C
Hyderabad
December 11, 2024 21: 48 PM
Slider తెలంగాణ ప్రత్యేకం

నాణ్యత కరువైన వేములవాడ రాజన్న లడ్డు

vemulawada

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లో  భక్తులకు ఎంతో ప్రీతి పాత్రమైన లడ్డు  ప్రసాదం తయారీలో నాణ్యత కరువయి ముక్క వాసన వస్తుందని భక్తులు వాపోతున్నారు. గురువారం లడ్డు ప్రసాదం కొన్న భక్తులకు లడ్డు లో నాసిరకం కిస్మిస్ లు వాడడం తో ఆదో రకమైన వాసనతో లడ్డు తినలేక పోయామని వారు వాపోయారు.  దేవాలయ ప్రసాద విక్రయ కేంద్రం లో రూ.20 ల తో పాటు రూ.100 ల కు ఒక్కో లడ్డును భక్తులకు విక్రయిస్తున్నారు. దేవస్థానం ప్రసాద తయారీ గోదాం లో తయారయ్యే ఈ లడ్డు కు కావాల్సిన దిట్టము ను సంవత్సరానికి సరి పడ టెండర్ విధానం ద్వారా దేవస్థానం కొనుగోలు చేస్తుంది. కాంట్రాక్టర్లతో కుమ్ముక్కైన గత ఈ. వో అనుమతితో నాసిరకం కాజు కిస్మిన్ లతో పాటు యాలకులు తదితర దిట్టం సామాగ్రి పంపుతున్నారు. సిబ్బంది కూడా ఉన్నతాధికారుల తో పెట్టుకోవడం ఎందుకని మిన్నకుండా ఉండిపోయారు.ఒక దశలో అయితే కాజు,కిస్మిస్,యాలకులు వాడిన సందర్భం కుడా లేకపోవడం,నెయ్యి నైతే నల్లబజార్ కు తరలించి అమ్ముకున్న కథనాలు కోకొల్లలు అని భక్తులు బహిరంగంగానే విమర్శించారు. అయితే ఇటీవల దేవాదాయశాఖ శాఖ నిజాయితీ పరు రాలైన  ఆడిష్నల్ కమీషనర్ కృష్ణ వేణి ని నియమించడం తో ఈ మాత్రం కిస్మిస్,కాజులను లడ్డు లో వాడుతున్నారు. అవి గత  కొంత కాలంగా వాడకుండా మిగిలి పోయిన సామగ్రి అయివుంటుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఈ సంఘటనపై విచారణ జరిపి నాణ్యమైన లడ్డులు భక్తులకు అందించాలని వారు కోరుతున్నారు.

Related posts

కల్లు గీత కార్మికుల్ని ఆదుకోవాలి

Satyam NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కష్టం రానివ్వద్దు

Satyam NEWS

ఒంటిమిట్టలో ధ్వజావరోహాణం పూర్ణాహుతి పూర్తి

Satyam NEWS

Leave a Comment