30.7 C
Hyderabad
May 5, 2024 03: 22 AM
Slider నెల్లూరు

సరదాగా నవ్వుకోండి: నట కిరీటి రాజేంద్రప్రసాద్ పెట్టిన అద్భుతమైన చిరుతిండి

#Rajendra Prasad

నటుడు రాజేంద్రప్రసాద్ సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా మంచి హాస్య చతురుడు. ఆయన ఏది మాట్లాడినా నవ్వు వస్తుంది. ఆయన హావ భావాలు కూడా చాలా నవ్వు తెప్పిస్తాయి. చాలా మంచి మనిషి. స్నేహశీలి. ఒకసారి పరిచయమైతే ఎప్పటికీ మరిచిపోరు ఒక సాయంత్రం నేను హైదరాబాదులో ఆయన ఇంటికి వెళ్లాను.

ఏదైనా తీసుకోండి అని అడిగారు. నేను మధ్యాహ్నం బిర్యాని తిన్నాను. ఇంకా ఏమి తినలేనని చెప్పాను. దానికి ఆయన- ‘మీకు అద్భుతమైన ఒక చిరు తిండి పెడతాను’ జీరో క్యాలరీస్. పొట్టకు తేలికగా ఉంటుంది. అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.’ అని ఊరించారు. దాంతో నేను ఊ అనక తప్పలేదు. వెంటనే అక్కడ ఉన్న అబ్బాయిని అది తెమ్మని పురమాయించారు. అతను ఒక ప్లేట్ లో తెచ్చి పెట్టాడు. తీరా చూస్తే అవి బళ్ళారి బొరుగులు.

అందులో అక్కడక్కడ వేరుశనగ పప్పు ఉంది. పసుపు రంగులో పొడుగ్గా ఉన్న ఆ బొరుగులు కరకరలాడుతూ, చాలా రుచిగా ఉన్నాయి. నిజంగానే అద్భుతం అనిపించాయి. ‘మీ మాటలు నిజమే ప్రసాద్ గారు’ అని చెప్పాను. మరేమిటి ప్రసాదా …మజాకా అన్నారు నవ్వుతూ…

-ఫయాజ్, సీనియర్ జర్నలిస్ట్, నెల్లూరు.

Related posts

ఘనంగా ఐ ఎన్ టి యు సి 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Satyam NEWS

పుట్టిన రోజు సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రభుదాస్‌

Satyam NEWS

కరోనా హెల్ప్: దత్తత గ్రామంలో నిత్యావసరాలు పంచిన సీపీ

Satyam NEWS

Leave a Comment