33.7 C
Hyderabad
April 30, 2024 00: 57 AM
Slider కడప

జగన్ జిల్లా పర్యటన వల్ల ఒరిగింది ఏమీ లేదు

#Gali Chandra

జగన్ తన తండ్రి వైఎస్ఆర్ చేపట్టిన పనులు పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ప్రతి ఏటా డిసెంబరు 23 నుండి 25 వరకు మొక్కుబడి జిల్లా పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని, జిల్లా సమగ్రాభివృద్ధి కై పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉద్యమానికి సమాయత్తం చేస్తున్నట్లు శుక్రవారం కడప జిల్లా వేంపల్లి లో కరపత్రాల విడుదలలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిసెంబర్ 26 నాటికి భారతదేశంలో పార్టీ స్థాపించి 98 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కడప నగరంలో 10గంటలకు కళాక్షేత్రం నుండి ప్రదర్శన, జిల్లా పరిషత్ లో బహిరంగ సభ డిసెంబర్ 26 నిర్వహించబోతూ ఉన్నాం.

98 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర పోరాటంలో ముందు ఉండి పోరాడి అనేక త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర కలదు. తదనంతరం కూడా దేశంలో భూమి కోసం, భుక్తి కోసం సాగిన అనేక పోరాటాలలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ సిపిఐ అన్నారు. అదేవిధంగా రాజకీయంగా ఆర్థికంగా సమానత్వం కోసం పోరాటం సాగిస్తున్నటువంటి పార్టీ. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుపెడితే అనేక పోరాటాలకు ముందుండి నాయకత్వం వహించిన పార్టీ సిపిఐ పార్టీ. అలాగే దేశంలో బ్యాంకుల జాతీయకరణ. రాజభరణాల రద్దు. వెట్టి చాకిరి విముక్తి చట్టాలు. అలాగే జాతీయ. ఉపాధి హామీ చట్టం తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన పార్టీ. కానీ ఇవాళ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం.

ప్రభుత్వ రంగా సంస్థలన్నిటినీ తెగ అమ్ముతూ.ప్రైవేటు పరం చేస్తూ. దేశ సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్న శ్రామిక వర్గాన్ని దోపిడీ చేసే చట్టాలను తీసుకొని వచ్చి ఇటు రైతాంగాన్ని ఇటు వినియోగదారులను నిలువునా దోపిడీ చేసే సాగు చట్టాల పేరుతో దగా చేస్తూ ఉన్నది.అలాగే మరియు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించే బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకొని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న తరుణంలో ఇవాళ కట్టుకునే బట్ట పైన తినే తిండి పైన మాట్లాడే భాష పైన.

కులం పేరుతో మతం పేరుతో ప్రాంతాల పేరుతో దేవుళ్ల పేరుతో దేశభక్తి పేరుతో మత వైశ్యామ్యాలను రెచ్చగొట్టి రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్న బిజెపి పార్టీ ప్రాసిస్టు ధోరణకు వ్యతిరేకంగా. ప్రజా వ్యతిరేక విధానాల పైన పోరాటానికి పిలుపు ఇస్తున్నది. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రంలో అభివృద్ధి రంగాలు అయిన పారిశ్రామిక రంగం నీటిపారుదల రంగం 2 పూర్తిగా పక్కకు నెట్టి. కేవలం నవరత్నాల పేరుతో ప్రజలను నగదు బదిలీ ద్వారా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఓటర్స్ ను ఓట్లుగా మార్చుకునే పథకాలతో అభివృద్ధి పూర్తిగా కుంటి బడిన తరుణంలో సంక్షేమాన్ని పూర్తిగా మరిచిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన వనరులైన ల్యాండ్, శాండు, వైను,మైన్ వ్యాపారాలు వైసీపీ నాయకులు మాఫియాగా ఏర్పడి జిల్లాలో పెండింగులో ఉన్న ప్రాజెక్టును పూర్తి కోసం కడప ఉక్కు ఫ్యాక్టరీ పారిశ్రామిక అభివృద్ధి విద్య వైద్యం సమగ్ర అభివృద్ధి కోసం సమరశీల పోరాటాలను చేపట్టేందుకు సిపిఐ 98వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని కేంద్రంలోని బిజెపి గవర్నమెంట్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పైన వారిని గద్దె దించే విధంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

డిసెంబర్ 26వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా ఆయన కోరారు. కావున డిసెంబర్ 26 జరిగే కడపలో జరిగే ప్రదర్శన బహిరంగసభ లో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పులివెందుల ఏరియా సహాయ కార్యదర్శిలు కే బ్రహ్మం ఎస్ భాషా మురళి అంజనప్ప జకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

ద్వారకా తిరుమలలో ముగిసిన మహా పాశుపత హోమం

Satyam NEWS

నిరంతరం అందుబాటులో ప్రజలకు వైద్య సేవలు అందించాలి

Satyam NEWS

ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను

Bhavani

Leave a Comment