ఉప్పల్ నియోజకవర్గం లోని కాప్రా సర్కిల్ మీర్‌పేట్ హెచ్‌బికాలని డివిజన్ కార్పోరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ జన్మదిన వేడుకలు ఆదివారం హెచ్‌బికాలనీలోని నివాసంలో ఘనంగా జరిగాయి.
పుట్టిన రోజు సందర్బంగా రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి లను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్బంగా చర్లపల్లి డివిజన్ కార్పోరేటర్ బొంతు శ్రీదేవియాదవ్, మల్లాపూర్‌డివిజన్ కార్పోరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి లు కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మానించి కేక్ తినిపించారు.
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.