29.2 C
Hyderabad
May 10, 2024 00: 45 AM
Slider ముఖ్యంశాలు

టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చాలని వినతి

#brsmp

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని ఉభయ సభల్లో బీఆర్ఎస్ పార్టీగా మార్చాలని ఆ పార్టీ ఎంపీలు ఆయా సభాపతులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు  టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో పలువురు ఎంపీలు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా లను వారి చాంబర్లో వేర్వేరుగా కలిసారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తీరును వారికి వివరించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో పార్టీ పేరు మార్చాలని కోరుతూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంతకంతో కూడిన లేఖలను వారికి అందజేశారు. సభాపతులను కలిసిన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, కే ఆర్ సురేష్ రెడ్డి, బీబీ పాటిల్ తదితరులు ఉన్నారు.

Related posts

త్యాగంతో వెలుగులు నింపారు.

Sub Editor 2

ధరలు స్థిరంగా ఉండి, రానున్న సంవత్సర కాలమంతా సుఖం

Satyam NEWS

లంచం తీసుకుంటే తప్పేముంది.. బీఎస్పీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

Sub Editor

Leave a Comment