39.2 C
Hyderabad
May 4, 2024 19: 59 PM
Slider రంగారెడ్డి

గ్రామీణ ప్రజలను ఆరోగ్యంగా ఉంచడమే ఉప్పల ట్రస్ట్ లక్ష్యం

#uppalatrust

గ్రామాల్లో నివసించే ప్రజలను ఆరోగ్యంగా ఉంచడమే తమ లక్ష్యమని ఉప్పలచారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో కామినేని హాస్పిటల్ సహకారంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో వైద్యం అందని ద్రాక్షగా మారిందని ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే కొన్నిచోట్ల వైద్య సిబ్బంది లేక మరొకచోట రోగులకు అవసరమైన మందులు బయటకు రాస్తున్నారని విమర్శించారు.దాదాపు గ్రామంలో 211 మందికి రక్తపోటు, చెక్కెర వ్యాధి కి సంబంధించిన పరీక్షలు నిర్వహించి అనారోగ్యానికి గురైన వారికి ఉచితంగా మందులు అందజేసినట్లు ఆయన తెలిపారు.

ఉప్పల ట్రస్ట్ సేవలను ఉద్దేశించి గ్రామ ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి జీవితంలో ముఖ్యమైన విద్య ,వైద్యం పేద మధ్య తరగతి వర్గాల వారికి అందకుండా పోతున్నా ఉప్పల వెంకటేష్ తమ ట్రస్టు ద్వారా మాకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందజేస్తున్నారని కొనియాడారు.

ఏ ప్రభుత్వం వచ్చినా పేద ప్రజలకు విద్య ,వైద్యం అందకుండా చేస్తున్నాయని ప్రభుత్వం చేయాల్సిన పనులు ఉప్పల ట్రస్ట్ చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ వెంకటరామిరెడ్డి ఉప సర్పంచ్ రవి నాయక్ మల్లమ్మ రఘుమారెడ్డి లక్ష్మీదేవి యాదయ్య గౌడ్ భూపాల్ గౌడ్, కరుణాకర్ రెడ్డి శివాజీ శ్రీను సంపత్ గ్రామ పెద్దలు ,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మత మార్పిడి కోసం కాదు.. మనుషులను మార్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు

Satyam NEWS

రక్తదానం సామాజిక బాధ్యత: ఖమ్మం పోలీస్ కమిషనర్

Satyam NEWS

శాస్త్రవేత్త హత్యలో ఎవరా యువకుడు?

Satyam NEWS

Leave a Comment