29.7 C
Hyderabad
April 29, 2024 10: 48 AM
Slider ఖమ్మం

మత మార్పిడి కోసం కాదు.. మనుషులను మార్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు

#puvvada

క్రీస్తు యేసు ప్రభు మనలను కాపాడటానికి ఈ లోకానికి వచ్చాడని, ఆ ప్రభువు వచ్చింది మత మార్పిడి కోసం కాదని.. కేవలం మనుషుల మనస్తతత్వాలను మార్చడానికే ఈ లోకానికి వచ్చాడని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఖమ్మం నగరంలోని 13వ డివిజన్ శ్రీనగర్ కాలనీ 7వ లైన్ నందు రోడ్ నందు ఖమ్మం టౌన్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండర్ పాస్టర్ PJ హనుమంతరావు గారి ఆద్వర్యంలో నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు యేసు ప్రభువు మార్గం అనుసరనియమన్నారు. మనం ఏ మతం నైన స్వేచ్ఛగా ఆచరించవచ్చు అని మంత్రి పువ్వాడ అన్నారు. ఒకే పండుగను యావత్ ప్రపంచం మొత్తం జరుపుకునేది క్రిస్మస్ అని పేర్కొన్నారు.

మనలను సన్మార్గంలో నిలిపి, మనకు రక్షణ కల్పించడానికి యేసు లోకానికి వచ్చాడని, మనుషులలో ప్రేమ, శాంతి, సమాధానం ఇవ్వడానికి వచ్చారే తప్పా.. మతం మార్పిడి చేయడానికి రాలేదన్నారు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు తమ మతాలను స్వేచ్ఛగా ఆచరించే పూర్తి స్వేచ్ఛ, పూర్తి హక్కు ఉందన్నారు.

అన్ని మతాలను గౌరవించే పరమత సహనం మనకు  ఉండాలన్నారు. క్రీస్తు పుట్టినరోజు అయిన క్రిస్మన్ సందర్బంగా ఆ ప్రభువు దీవెనలు మీ అందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం క్రిస్మస్ పండుగను ప్రతి ఇళ్ళు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం పాస్టర్స్, నగరంలోని పేదలకు దుస్తులను మంత్రి పువ్వాడ చేతుల మీదగా పంపిణీ చేశారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు కొత్తపల్లి నీరజ, నాయకులు చావా నారాయణ రావు, వివిధ సంఘాల పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గిరిజనులకు అండగా ఉందాం

Bhavani

రామప్ప లో ఘనంగా వారసత్వ ఉత్సవాలు

Satyam NEWS

శాల్యూట్ డాడీ: నాన్నకు ప్రేమతో…..:

Satyam NEWS

Leave a Comment