38.2 C
Hyderabad
May 3, 2024 21: 40 PM
Slider ముఖ్యంశాలు

రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థితత్వం కోసం పోటాపోటీ…

#tdprajampet

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇంచార్జీ భత్యాల చెంగల రాయుడు గత ఎన్నికల ఓటమి నుంచి కర్మ,కర్త,క్రియగా మెలుగు తున్నారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ వివిధ కార్యక్రమాలను పార్టీ చేపడుతూ ముందుకు సాగుతున్నారు.

అంతే కాకుండా నియోజకవర్గ పరిధిలోని రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సిద్దవటం, సుండుపల్లె, వీరపల్లె మండలాల్లో పార్టీ మండల,నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను కూడా నియమించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన భత్యాల కు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు,ఆయన ఏ మండలం వెళ్లినా ఆయాన్ని ఎక్కువగా కలసి జై కొడు తుంటారు. ఆయన కూడా కుల సమీకరణ మాత్రమే కాకుండా ఇతర కులాలను కూడా వదలకుండా నిత్యం శుభ కార్యాలు మొదలు అశుభ కార్యక్రమాల ను సైతం వదల కుండా హాజరౌతుంటారు.

ఇదిలా ఉంటె రాజంపేట తెలుగు దేశం పార్టీలో తాజాగా ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. వీరపల్లె మండలం కు చెందిన రాజు విద్యా సంస్థల అధినేత చమర్తి జగన్ మోహన్ రాజు అన్నీ మండలాల్లో టీడీపీ నాయకుల సహకారంతో సేవా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.గత ఎన్నికల ముందు చమర్తి జగన్ మోహాన్ రాజు తెలుగుదేశం రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేసినా ఫలించ లేదు. సామాజిక సమీకరణాలు దృష్ట్యా టీడీపీ అధినేత భత్యాల కు అవకాశం ఇచ్చారు.

ఎన్నికలు ముగిసి టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో చమర్తి జగన్ మోహన్ రాజు పార్టీలో ఉన్నా, ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించిన దాఖలాలు లేవు. ఈ నేపధ్యంలో రానున్న 2024 ఎన్నికల కోసం అధికార, ప్రతి పక్ష పార్టీలు ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నట్టు హడావుడి కనిపిస్తోంది. అందులో భాగంగా చమర్తి జగన్ మోహాన్ రాజు కూడా మరో మారు వచ్చే ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది.

రంజాన్ పండుగ ముందు ఓ పక్క భత్యాల అన్నీ మండలాల్లో పార్టీ తరపున భారీగా ఇఫ్తార్ విందులు నిర్వహించిన సమయంలోనే, చమర్తి జగన్ మోహాన్ రాజు కూడా  పేద ముస్లింలకు నియోజక వర్గ పరిధిలోని అన్నీ మండలాల్లో రంజాన్ తోపా పేరిట చంద్రబాబు, లోకేష్ బాబు ఫొటోలు ముద్రించిన ఉన్న పసుపు సంచుల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. భత్యాల వన్ మ్యాన్ ఆర్మీలా టీడీపీ కోసం కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్న నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తమ నాయకునిదే అని ధీమాగా ఉన్న భత్యాల వర్గీయుల్లో కొంత అనుమానం నెలకొంది.

ఇదే విషయం పై అయన వర్గీయులు చంద్రబాబు నాయుడు వద్ద ప్రస్తావన తేగా ఆయన భరోసా ఇచ్చినట్టు భత్యాల వర్గీయుల చెప్పు కుంటున్నారు.ఈ నేపధ్యంలో టీడీపీ ఎమ్మెల్యే సీటుకోసం చమర్తి జగన్ మోహాన్ రాజు కూడా ప్రయత్నాలు చేయడం రాజంపేట తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాయుడా, రాజు నా మరెవరైనా నా అనేది కాలమే బాబు రూపంలో నిర్ణయిస్తారు. అంత వరకు అన్నీ ఊహాగానాలే, అనుమానాలే కొనసాగుతుంటాయి.

Related posts

తుంగలో తొక్కిన మరో హామీపై జగన్ కు త్రిబుల్ ఆర్ ఘాటు లేఖ

Satyam NEWS

‘అవధానానికి ఒకరోజు’.. ఏమైందో ?

Bhavani

వనపర్తి జిల్లాలో ధరణి పోర్టల్ నిర్వహణ విజయవంతం

Satyam NEWS

Leave a Comment