37.2 C
Hyderabad
May 6, 2024 13: 37 PM
Slider ముఖ్యంశాలు

కమ్మేసిన ముసురు

#heavy rain

ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో రెండు రోజుల నుంచి ముసురు కమ్ముకుంది.ముఖ్యంగా హైదరాబాద్ మహానగరమైతె రెండు రోజులుగా ముసురు కమ్మేసింది. కాగా భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

దీనికి తోడు తీవ్ర చలిగాలుల వీస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు.ఇదిలా ఉంటే మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, సిద్దిపేట, కామారెడ్డి, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట భూపాలపల్లి లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే ప్రజలను కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Related posts

ఏడుగురికి సిఎం సహాయ నిధి చెక్కులు

Satyam NEWS

కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: ఆది శ్రీనివాస్

Satyam NEWS

ఓదెల రైల్వేస్టేషన్’ వశిష్ట సింహ లుక్ విడుదల

Sub Editor

Leave a Comment