29.7 C
Hyderabad
May 6, 2024 05: 02 AM
Slider హైదరాబాద్

కూతురు బర్త్ డే కు టమాటాలు గిఫ్ట్

#Tomatoes gift

కుటుంబ సభ్యుల పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం చేయడం, పండ్లు పంపిణీ చేయడం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ తండ్రి మాత్రం తన కూతురి పుట్టిన రోజు నాడు వినూత్నంగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. టమాటలను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏ కూర వండినా అందులో టమాటను మస్ట్‌గా వాడుతుంటాం.

అలాంటి టమాట ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు వాటిని కొనలేకపోతున్నారు. అందుకే టమాట ధరలు కొండెక్కిన ఈ సమయంలో వాటిని పేదలకు పంచిపెట్టి తన కూతురి బర్త్‌డేను సెలబ్రేట్‌ చేయాలని అనుకున్నాడు హైదరాబాద్‌ పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌కు చెందిన టీఎమ్మార్పీఎస్‌ యువసేన అధ్యక్షుడు నల్ల శివ.

అనుకున్నట్టుగానే టమాటలను పంచిపెట్టాడు. టమాటల పంపిణీ అంటే ఏదో నాలుగైదు కిలోలు.. మహా అయితే 10 కిలోలు పంచిపెట్టాడని అనుకుంటున్నారేమో! కాదు.. కాదు… ఏకంగా 4 క్వింటాళ్ల వరకు టమాటలను పంపిణీ చేసి ఔరా అనిపించాడు టమాట ధరలు ఆకాశన్నంటిన తరుణంలో బిడ్డ పుట్టిన రోజు సందర్భంగా పెద్దమొత్తంలో టమాటాలను ఉచితంగా పంపిణీ చేయడం ఆసక్తిగా మారింది.

Related posts

గత కాలపు భూ సమస్యల పరిష్కారానికే రీ- సర్వే

Satyam NEWS

వారసత్వ పొలం కోసం దారుణంగా నరికి చంపారు

Satyam NEWS

ఈ డి ప్రోబ్:ఇక్బాల్ మిర్చికేసులో కపిల్ వాధావన్ అరెస్ట్

Satyam NEWS

Leave a Comment