37.2 C
Hyderabad
May 6, 2024 20: 03 PM
Slider సినిమా

దేవరశాంటా ఫ్రీ వెకేషన్ గిఫ్ట్ ఇవ్వనున్న హీరో విజయ్ దేవరకొండ

#Vijay Devarakonda

న్యూ ఇయర్ బహుమతులు ఇస్తూ గత ఐదేళ్లుగా దేవరశాంటా పేరుతో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. అభిమానులకు ఒక్కో సంవత్సరం ఒక్కో బహుమతి ఇస్తూ సర్ప్రైజ్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు ప్రపంచం లో ఏ హీరో చేయని విధంగా చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది కూడా మరో సరికొత్త ఆలోచనతో దేవరశాంటాగా ముందుకొచ్చారు విజయ్.

100 మంది అభిమానులను ఫ్రీ హాలీడే టూర్ కు పంపించబోతున్నారు. దేవరశాంటా యాష్ ట్యాగ్ పేరుతో తనకు వచ్చిన రిక్వెస్టుల నుంచి వందమంది అభిమానులను ఎంపికచేసి పూర్తి ఖర్చులు తానే భరించి వెకేషన్ పంపించబోతున్నారు. ఇందుకు నాలుగు ఆప్షన్స్ విజయ్ సూచించారు.

మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియా, బీచెస్ ఆఫ్ ఇండియా, కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా, డిసెర్ట్స్ ఇన్ ఇండియా…ఇలా ఈ నాలుగు ఆప్షన్స్ లో ఎక్కడికి టూర్ కు వెళ్లాలన్నా విజయ్ దేవరకొండ పూర్తిగా ఉచితంగా పంపించబోతున్నారు. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ హీరో తన అభిమానులను ఇలా ఫ్రీ హాలీడే ట్రిప్ కు పంపించలేదు. సెలవుల్లో ఏదైనా టూర్ కు వెళ్లాలనుకుని ఖర్చులకు సందేహించే అభిమానులు దేవరశాంటా ఆలోచనను ప్రశంసిస్తున్నారు.

Related posts

శ్రీ‌రామ నామ ‌స్మ‌ర‌ణ‌తో పులకించిన తిరుమలగిరులు

Sub Editor

అన్నదాన కార్యక్రమం చేపట్టిన మున్నూరు కాపు సంఘాలు

Satyam NEWS

గుడిసెలు తగలబె ట్టిన వారిని వెంటనే శిక్షించాలి: సీపీఎం డిమాండ్

Satyam NEWS

Leave a Comment