37.2 C
Hyderabad
April 26, 2024 21: 35 PM
Slider ప్రత్యేకం

చిన్నారెడ్డిపై రేవంత్ రెడ్డికి పిర్యాదు

వనపర్తిలో నెలకొన్న కాంగ్రెస్ పార్టీలో అనిచ్చితి తొలగించాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కోరుతూ వనపర్తి నుండి ఏడు మండలాలు, వనపర్తి పట్టణం నుండి హైదరాబాదు చేరుకున్నారు. నేతలలో మాజీ జిల్లా పార్టీ అధ్యక్షుడు పిసిసి డెలిగేట్ శంకర్ ప్రసాద్, మాజీ పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, మాజీ జెడ్పిటిసిలు రమేష్ గౌడ్, వేణుగోపాల్, సీనియర్ నాయకులు తేనేటి రవీందర్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, మాజీ జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, కొత్తకోట పార్టీ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా పార్టీ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాండు సాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆవుల రమేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాళ్లే నాయక్, రవి కిరణ్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందిమల్ల చంద్రమౌళి, శ్రీనివాసపూర్ రాములు, కురుమూర్తి, ఘనపూర్ దేవుజా నాయక్, గోపాల్పేట్ నుండి కొంకి రమేష్, పెబ్బేరు మండల నుండి సర్వీశ్, గుమ్మడం రాజు, పెద్దమందడి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, పామిరెడ్డి పల్లె మాజీ ఉపసర్పంచ్ రమేష్ నాయక్, అన్ని మండలాల గ్రామాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడితో నాయకులు మాట్లాడుతూ వనపర్తి లో కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటే చుట్టుపక్కల మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, దానికి సంబంధించి సీనియర్ మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిని ఒప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత 90% కొత్త అభ్యర్థిపై ఆశలతో గెలుపు గుర్రం అవుతుందని, వనపర్తి గెలిస్తే రాష్ట్రంలో అధికారం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకుని వనపర్తిలో సర్వే చేయించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఆలోచిస్తానని, చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వనపర్తిలో కొత్త అభ్యర్థి రావాల్సిందేనని కార్యకర్తలు చెప్పారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

దళిత సాధికారత కోసమే దళిత బంధు పథకం అమలు

Satyam NEWS

పుష్కరాల్లో సంగీత విభావరి

Sub Editor

Side Effects Of Having High Cholesterol

Bhavani

Leave a Comment