27.7 C
Hyderabad
April 30, 2024 07: 50 AM
Slider ఖమ్మం

ఘనంగా హోలీ సంబురాలు

#cpkmm

కేరింతలు..ఆనందోత్సవాల  మధ్య హోలి సంబురాలను పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హోలీ వేడుకలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ గారు పోలీస్  సిబ్బందిపై రంగులను చల్లుతూ…ఆట, పాటలతో  ఆనందాన్ని పంచుకుంటూ..నృత్యాలతో సందడి చేశారు. పోలీస్ కమిషనర్  హోలీ శుభాకాంక్షలతో ప్రారంభమైన సందడి వాతావరణం పోలీస్ బ్యాండ్ చప్పుళ్లతో హోరెత్తింది.ఆప్యాయత, అనురాగాలను పంచే హోలీ వేడుకల్లో కుటుంభీకుల మధ్య అన్యోన్యత, ఆందరూ ఆరోగ్యంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు. ఆనంతరం జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ ని కలసి పోలీస్ కమిషనర్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలలో  అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు భస్వారెడ్డి, ప్రసన్న కుమార్ ,రవి  శ్రీనివాస్ , సాంబశివరావు , శ్రీశైలం, , శ్రీధర్, సర్వయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

భద్రాచలంలో పెరిగిన గోదావరి ఉధృతి

Bhavani

నిర్భయ తల్లి:ఈసారైనా వారికి ఉరి శిక్ష పడుతుందా

Satyam NEWS

అరుదైన మైలురాయి చేరుకున్న స్టార్టప్ లు

Satyam NEWS

Leave a Comment