27.7 C
Hyderabad
May 7, 2024 08: 00 AM
Slider విశాఖపట్నం

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా నియమితులైన డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి

#swarajyalaxmi

డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మిని  డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా నియమిస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ యు స్వరాజ్యలక్ష్మి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక పదవులు చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చారు. నిరంతరం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలోనూ ఆమె చేసిన కృషి అమోఘం.

అంతేకాకుండా స్వరాజ్యలక్ష్మి ఏ పదవిలో ఉన్న వైద్య సిబ్బంది సమస్యల పరిష్కారంలో ఆమె చూపే చొరవ ప్రశంసనీయం. స్వరాజ్యలక్ష్మి తమ విభాగపు అధినేతగా పనిచేయడం ఆ విభాగపు సిబ్బందికి ఎంతో ఇష్టం. ఇప్పటివరకు ఏ పదవిలో ఉన్న ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా నిరంతరం ఆమె చేసిన సేవలే ఆమెకు ఉన్నత పదవులను కట్టబెట్టాయి.

ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ గా పని చేస్తున్న డాక్టర్ స్వరాజ్యలక్ష్మి కి వైద్య విభాగంలో అత్యున్నత పదవిగా భావించే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా నియమితులయ్యారు. గతంలో విశాఖ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ గా పనిచేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ గా విధులు నిర్వహిస్తూ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు సైతం వైద్య సేవలను విస్తరించిన ఘనత డాక్టర్ స్వరాజ్యలక్ష్మి కే దక్కుతుంది. ఆనాటి విశాఖ జిల్లాలోని పాడేరు, అరకు, ముంచింగ్పుట్ ఇలా మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు వైద్య సేవలు అందే విధంగా స్వరాజ్యలక్ష్మి కృషి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా డాక్టర్ స్వరాజ్యలక్ష్మి నియమించడంతో రాష్ట్ర ప్రజలందరికీ సకల వైద్య సేవలు అందే అవకాశాలు మెరుగుపడతాయని పలువురు భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మారుమూల గ్రామంలో జన్మించిన స్వరాజ్యలక్ష్మి డాక్టర్ గా విద్యాభ్యాసం చేసి అంచలంచెలుగా అనేక పదవులను చేపట్టారు. నిరంతరం పేద ప్రజలకు పారదర్శకంగా వైద్య సేవలు అందేలా డాక్టర్ స్వరాజ్యలక్ష్మి నిరంతరం కృషి చేస్తూ ప్రజా వైద్యురాలిగా పేరుగాంచారు. 

ఏ పదవిని అలంకరించిన ఆ పదవికే ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగిగా నిరంతరం ప్రజలకు, సిబ్బందికి అందుబాటులో ఉంటూ అనేక సేవలందిస్తూ అందరి ప్రతి మన్ననలను అందుకున్నారు. డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తన సర్వీసులో ఎక్కడ అవినీతి ఆరోపణలు లేకుండా అందరి మన్ననలు పొందుతూ పదోన్నతులు పొందారు.

ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఆ కార్యాలయాన్ని సుందర  నందనవనంగా తీర్చిదిద్దారు. నిరంతరం ఉద్యోగులకు, వైద్య సిబ్బందికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తనవంతు కృషి చేశారు.

తను పనిచేస్తున్న సిబ్బంది మనల్ని కాకుండా సామాన్య ప్రజల అభినందనలు సైతం పొందడం, ఆమె పనితనానికి చిత్తశుద్ధి సేవలకు నిదర్శనం. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా నియమితులైన డాక్టర్ యు స్వరాజ్యలక్ష్మి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులను పొంది ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తారని ఆశిద్దాం. పదోన్నతి పొందిన డాక్టర్ స్వరాజ్యలక్ష్మి కి  విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి , డి ఐ ఓ జీవన్ రాణి  , ఏఓ బి. ఎస్. సుమతి , వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు  శుభాకాంక్షలు తెలియజేశారు

Related posts

భువ‌నేశ్వ‌ర్‌ శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా జ‌లాధివాసం

Satyam NEWS

శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం

Satyam NEWS

జగనన్నకు చెబుదాం ఫిర్యాదుల విచారణ పూర్తి చెయ్యాలి

Satyam NEWS

Leave a Comment