34.7 C
Hyderabad
May 4, 2024 23: 43 PM
Slider రంగారెడ్డి

ఆన్ లైన్ లో హార్స్ రేస్ బెట్టింగ్ ముఠా అరెస్టు

#medipallypolice

ఆన్ లైన్ లో హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఉప్పల్ నియోజకవర్గంలోని మేడిపల్లి పోలీసులు. వివరాల్లోకి వెళితే…. మేడిపల్లి ఓం విహార్ కాలనీలో ఒక ఇంట్లో  లో  ఆన్ లైన్  లో హార్స్ రేస్ బెట్టింగ్  జరుగుతుంది అనే  నమ్మదగిన సమాచారం ప్రకారం  మేడిపల్లి పోలీస్ వారు ఆ ఇంటి పై రైడ్ చేశారు. అక్కడ నలుగురు వ్యక్తులు ల్యాప్ టాప్ మరియు ఫోన్స్ పెట్టుకొని ఆన్లైన్ బెట్టింగ్  నిర్వహిస్తుండగా రెడ్ హాండెడ్ గా వారిని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారి పేర్లు:

1). కొమిరెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి , తండ్రి. ప్రభాకర్ రెడ్డి , వయస్సు. 36 సం.లు, వృత్తి. సాఫ్ట్ వేర్ ఉద్యోగి, నివాసం. ప్లాట్ నెంబర్. 406, నాగశ్రీ  ఎన్ క్లేవ్, గోకుల్ సర్కిల్, KPHB

2). కేశన గోపినాథ్ , తండ్రి. శ్రీనివాస రావు , వయస్సు. 27  సం.లు, వృత్తి. ప్రైవేట్ ఉద్యోగి, నివాసం. ఇంటి  నెంబర్. 8-252/A, వెంకన్న హీల్స్, చింతల్ బస్తి, కుత్బుల్లా పూర్, జీడిమెట్ల.

3). గడ్డం కార్తీక్ కుమార్,  తండ్రి. భరత్ కుమార్, వయస్సు. 28  సం.లు, వృత్తి. ప్రైవేట్ ఉద్యోగి,. నివాసం. ఇంటి  నెంబర్. 8-252/A, వెంకన్న హీల్స్, చింతల్ బస్తి, కుత్బుల్లా పూర్, జీడిమెట్ల.

4) మెట్టు రాజేశ్ ,  తండ్రి. సంతోష్ , వయస్సు. 40  సం.లు, వృత్తి. పాల వ్యాపారం ,. నివాసం. ప్లాట్ నెంబర్. 98, ఓం విహార్ కాలనీ, మేడిపల్లి మండలం, మేడ్చల్ జిల్లా

విష్ణు వర్ధన్ మరియు కర్నాటకకి చెందిన చిరంజీవి అనే వ్యక్తి Whats app లో WIN VISION GROUP క్రియేట్ చేసి దానిలో బెట్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లని యాడ్ చేస్తుంటారు. ఇండియా లో జరిగే గుర్రపు రేసులను BET 365 online website ద్వారా తెలుసుకొని వాటి వివరాలు Whats app లో WIN VISION GROUP లో పెట్టి గ్రూప్ లో పెడతారు. గ్రూప్ లో ఉన్నవాళ్లతో బెట్టింగ్ పెట్టమని చెబుతుంటారు. గుర్రపు పందాలకు సంబంధించిన వివరాలు విష్ణు వర్ధన్ మరియు చిరంజీవి గ్రూప్ లో పోస్ట్ చేయగా గ్రూప్ లో ఉన్నవాళ్ళు వారికి నచ్చిన గుర్రం పై బెట్టింగ్ పెడతారు.

విష్ణు వర్ధన్ దగ్గర గోపినాథ్ మరియు కార్తీక్ లు అసిస్టెంట్ ల పనిచేస్తుంటారు. విష్ణువర్ధన్ కి చెందిన లావాదేవీలను చూసుకుంటూ వారు కూడా బెట్టింగ్ పెడుతుంటారు. ఆ విధంగా 23వ తేదీన గ్రూప్ లో సభ్యుడైన రాజేశ్ కి చెందిన ఇంట్లో విష్ణువర్ధన్, కార్తీక్ , గోపినాథ్  మరియు రాజేశ్ కలిసి వారు క్రియేట్ చేసిన Whats app WIN VISION గ్రూప్ లో Horse racing బెట్టింగ్ నిర్వహిస్తుండగా మేడిపల్లి పోలీస్ వారు  పట్టుకున్నారు. 

వీరి వద్ద నుండి మొత్తం 7,00,000/- రూపాయలు నగదు, ఐదు సెల్ ఫోన్స్ మరియు  ఒక ల్యాప్ టాప్ స్వాధీన పర్చుకొని, కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపించారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేడిపల్లి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోవర్ధన గిరి తెలిపారు.

Related posts

కామినేని లో  చికిత్స పొందుతున్న నిఖిల్ ని పరామర్శించిన బి ఎల్ ఆర్

Satyam NEWS

అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్ గా వుండాలి

Murali Krishna

సంపాదనే ధ్యేయం కాదు… పిల్లల్ని సరిగా పెంచండి

Satyam NEWS

Leave a Comment