42.2 C
Hyderabad
May 3, 2024 15: 37 PM
Slider కృష్ణ

సాదియా ఆల్మస్ కు   సత్కారం

#mangalagiri

పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం అందుకున్న మంగళగిరి  నగరానికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ సాదియా ఆల్మస్ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  చేతుల మీదుగా  అవార్డు ను అందుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నగరానికి తిరిగి వచ్చిన సాదియా ఆల్మస్  మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే  అవార్డు గ్రహీత సాదియా ఆల్మస్ ను అభినందించి అనంతరం  ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మరింతగా రాణించి  దేశానికి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ కన్వీనర్ మునగాల మల్లేశ్వర రావు, ఈదుల మూడి డేవిడ్ రాజు, కొల్లి శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మీ ఇంట్లో పెళ్లా? ఈ రూల్సు పాటించండి

Satyam NEWS

అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన గౌతమ్ అదానీ

Satyam NEWS

స్కాములతో రాష్ట్రాన్ని అభాసు పాలు చేస్తున్న బీ ఆర్ ఎస్

Satyam NEWS

Leave a Comment