28.7 C
Hyderabad
May 6, 2024 01: 53 AM
Slider కడప

హార్స్లీ హిల్స్ భూములు అప్పనంగా రాయిస్తే ప్రజలు బుద్ధి చెబుతారు

#tdp

అన్నమయ్య జిల్లా దక్షిణ ఊటీగా పేరు ఉన్న  ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ కొండపై ఉన్న ప్రభుత్వ భూమిని వైకాపా ప్రభుత్వం అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు రాయిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. రాయచోటిలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రభుత్వ భూములను తన అనుయాయులకు, వైకాపాకు మేలు చేకూర్చే విధంగా సినిమాలు తీసే డైరెక్టర్లకు దారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ప్రభుత్వ భూ దోపిడీ విధానాన్ని ప్రజలలోకి తీసుకెళ్లి అడ్డుకుంటాం. 

ఇప్పటికే అసైన్మెంట్ కమిటీల పేరుతో ఎమ్మెల్యేలు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైకాపా నాయకులు, కార్యకర్తలకు అర్హత లేకపోయినా అప్పన్నంగా ప్రభుత్వ భూములకు డీకేటి పట్టాలు ఇప్పించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైకాపాలనలో సాగిన భూ దందాలను, అసైన్మెంట్ కమిటీల అక్రమాలను వెలికి తీస్తాం. పేదల భూములు కొట్టేసే దుర్బుద్ధితో ప్రభుత్వం భూ హక్కు చట్టాన్ని కూడా  తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా సహజంగా కోర్టులను ఆశ్రయిస్తారు.

కానీ భూ హక్కు చట్టం వలన రైతులకు భూముల పరంగా ఏదైనా ఇబ్బంది కలిగితే కోర్టులకు వెళ్లే హక్కు కూడా లేకుండా చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికి దక్కింది. ఇప్పటికీ ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపాకు ప్రజలు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. హార్స్లీ హిల్స్లో భూసేకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే తెదేపా క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలిసి ఉద్యమించి అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాను గోపాల్ రాజు, ఎస్టీ సెల్ నాయకుడు రెడ్డి నాయక్, రమణయ్య. బీసీ నాయకులు గంగయ్య. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జ్ఙాన స‌రస్వ‌తి దేవాల‌యంలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేష‌న్ 627 వ కార్య‌క్ర‌మం

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన

Satyam NEWS

ఏపి సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కష్టాలు మొదలు

Satyam NEWS

Leave a Comment