35.2 C
Hyderabad
May 1, 2024 01: 25 AM
Slider ముఖ్యంశాలు

ఏపి సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కష్టాలు మొదలు

#ysjaganmohanreddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన పార్టీకే చెందిన పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హమైనదని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది.

వాదనలు పూర్తి అయిన తర్వాత జడ్జిమెంటును రిజర్వు చేసిన సీబీఐ కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. పిటిషన్ అర్హతకు సంబంధించిన వాదోపవాదనలను కోర్టు విన్న తర్వాత ఈ నిర్ణయం వెలువరించింది.

అనంతరం ఈ పిటిషన్ ఆధారంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో ప్రశ్నిస్తూ ఆయనకూ, సీబీఐ కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణలు చెబుతున్నారు.

ఆర్ధిక నేరాలలో నిందితుడుగా ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా కాలంగా బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే.

Related posts

కన్నబాబు మౌనానికి అర్ధం ఏమిటి ?

Bhavani

జ‌ర్న‌లిస్టుల‌పై దాడుల‌ను అరిక‌ట్టాలంటూ క‌లెక్ట‌ర్ కు విన‌తి

Satyam NEWS

రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment