37.7 C
Hyderabad
May 4, 2024 13: 07 PM
Slider ప్రత్యేకం

Hot Topic: కొల్లాపూర్ పాలిటిక్స్: ఇటు సీఎం…అటు జూపల్లి

#jupally

తెలంగాణ రాష్ట్ర సాధనలో నాడు కేసీఆర్ వెంట నడిచి మంత్రి పదవిని త్యాగం చేసి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేసి తెలంగాణా ఉద్యమాన్ని ఉదృతం చేశారు జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఆయన భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా చేశారు.

అంతే కాదు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కూడా జూపల్లి అదే ఉద్యమ స్ఫూర్తితో అదే పార్టీలో  కొనసాగుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి జూపల్లిపై ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కొద్ది నెలలకే అధికార పార్టీ లోకి వచ్చారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో బీరం హర్షవర్ధన్ రెడ్డి టిఆర్ఎస్  ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా ఎన్నో విమర్శలు చేసేవారు. కాంగ్రెస్ లో గెలిచినా అధికార టీఆర్ఎస్ లోకి వచ్చాక ఆయన సహజంగానే కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. అంతటితో ఆగకుండా టీఆర్ఎస్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన జూపల్లిని టార్గెట్ చేస్తూ బీరం హర్ష వర్ధన్ రెడ్డి అనుచరులు ఎన్నో విమర్శలు చేసేవారు.

టీఆర్ఎస్ పార్టీకి వలస వచ్చిన కొత్తలో  జూపల్లి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా ఎమ్మెల్యే అనుచరులు  ప్రయత్నం చేశారు. ఈ మధ్య లోనే చిన్నంబావి మండలం పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి జూపల్లి పై కేసులు కూడా నమోదయ్యాయి. అంతే కాదు కొల్లాపూర్ నియోజకవర్గ  ప్రజల పై, జూపల్లి అనుచరుల పై  ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులతో అరాచకాలు వేధింపులు చేశారు.

వీటిపై జూపల్లి కృష్ణారావు పోలీస్ లను, జిల్లా ఎస్పీని కూడా  ప్రశ్నించారు. బాధితులకు అండగా నిలిచారు. అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోయారు. ఈ పరిణామాలను టీఎర్ఎస్ అధిష్టానం పట్టించుకోలేదు.

రాష్ట్ర ఉన్నత పోలీస్ శాఖ అధికారుల దృష్టికి కూడా జూపల్లి తీసుకెళ్ళారు కానీ అటు వైపు నుంచి కూడా ఆయన ఆశించిన స్పందన రాలేదు. అంతటితో ఆగకుండా జూపల్లి రాజకీయ వ్యతిరేకులు ఆయనను టార్గెట్ చేసి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. జూపల్లి టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని, త్వరలో  పార్టీ మారుతున్నారని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు పుట్టించారు.

అయితే ఈ దుష్ప్రచారం పై కూడా జూపల్లి ఎక్కడా నోరు విప్పలేదు. ఈ అంశాలను కూడా అధిష్టాన పెద్దల దగ్గరికి జూపల్లి తీసుకపోయారని  తెలిసింది. ఇది ఇలా ఉంటే కొల్లాపూర్ నియోజక వర్గంపై చేస్తున్న సర్వేలలో  జూపల్లి కృష్ణారావు పేరు ఎక్కువగా వినిపిస్తుంది. జూపల్లి వైపే  ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కొందరు చేయించిన సర్వేలో విషయం బయటికి వచ్చింది.

నియోజకవర్గంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా  గతంలో జూపల్లి మంజూరు చేయించిన సంక్షేమాలే అని ప్రజలు అంటున్నారు. కొన్ని అభివృద్ధి సంక్షేమాలను కక్ష్య సాధింపుతో మధ్యలోనే అపేసేలా చేశారని కూడా ప్రచారం జరుగుతుంది.

మొత్తం మీద జూపల్లి నియోజకవర్గంలో ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలుస్తుంది. దీనితో  జూపల్లి పై కొందరు  రాజకీయంగా మరింతగా టార్గెట్ ఎక్కువ  చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన ఓ నేత జూపల్లికృష్ణారావు ను టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతుంది. అందుకే జూపల్లిని రాజకీయంగా అణగదొక్కే పనిలో ఉన్నారని మాటలు వినిపిస్తున్నాయి.

అధిష్టానంతో సంబంధాలు లేకుండా చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జూపల్లి పై నియోజకవర్గ ప్రజలలో మరింత సానుభూతి పెరుగుతుంది. అయితే ఇది ఇలా ఉంటే. మార్చి8న మంగళవారం( ఈరోజు) ఉమ్మడి మహబూబ్ నగర్ వనపర్తి జిల్లా కేంద్రంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. బహిరంగ సభలో పాల్గొననున్నారు..ఉమ్మడి జిల్లా నేతలు సభలో పాల్గొన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తికి వచ్చిన సమయంలో   మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్ళక పోవడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ వనపర్తికి  వస్తుంటే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లా కు వెళ్లినట్లు తెలిసింది. అక్కడ  తుమ్మల నాగేశ్వర్ రావుతో సమావేశం కానున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఇది   హాట్ టాపిక్ గా మారింది.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

ఆగస్టు నాటికి దేశంలో పది లక్షల కరోనా మరణాలు

Satyam NEWS

ఆవ ఎండోమెంట్ కాలనీలోని 54 మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి

Bhavani

అమృతమే

Satyam NEWS

Leave a Comment