40.2 C
Hyderabad
April 26, 2024 13: 18 PM
Slider కవి ప్రపంచం

అమృతమే

#Manjula Surya New

ఒంటి కాలిపై తపస్సు చేసుకుంటున్న

మౌనమునిలా

భావదారిద్ర్యంతో మనిషి

ఎమోజీ లతో డమ్మీ అవుతున్నాడు

మాతృభాషను సమాధి చేసి

అరువు భాషనే పుష్పాలతో అలంకరిస్తున్నాడు అలరారుతున్నాడు

అమ్మభాషను అమ్ముకుంటూ

అరువు భాషను నమ్ముకుంటూ

తన ఆత్మనే వమ్ము చేసుకుంటూ

అస్థిత్వానికి కొత్త ముసుగే

సరికొత్తగా తొడుగుతున్నాడు

వయసు ఉడిగి సత్తువ తరిగి

ఆదరించే తన వాళ్ళు లేక

మృతి చెందుతోంది అనాథలా

మాట నేర్పిన మన మాతృభాష

నిలువ నీడనే లేక నిన్ను మలిచిన అమ్మ

నీ కళ్ళముందే  అదృశ్యమవుతోంది

తల్లి పాదాలనొక్కసారి  తాకి చూడు

అంతా కవికోకిలల కూజిత శబ్ద రస ధ్వనులే

కాస్త ప్రేమగా పలకరించి చూడు

ఒడలంతా వీణాతంత్రుల పులకరమే

దరికి కాస్త వచ్చి చూడు

కమ్మదనమే అంతా అమ్మతనమే

తెనుగు మాటను కాస్త పలికి చూడు

తేనె ధారల ప్రవాహమే

ఆస్తులను పోగుచేసి కట్టబెట్టేవు సంతతికి

అమ్మనే ఇచ్చిచూడు

ఈ మాతృకొమ్మనే నిలబెట్టి చూడు

తరతరాలకు తరగని సంపదై

తెలుగు వనాలనే  ప్రభవించును

ఆ సుగంధాలే అంతటా వెదజల్లును

మాతా శిశువుల్లా

సేదతీరుదురిరువురూ

ఒకరి ఒడిలో ఒకరు నిశ్చింతగా

భావితరమా ఇకనైనా మేలుకో

బాధ్యతను భుజాలపై వేసుకో

తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా

మంజుల సూర్య , హైదరాబాద్

Related posts

ప్రశ్నించే గొంతుకను విమర్శిస్తే ఊరుకునేది లేదు..

Satyam NEWS

అమిత్ షాతో కీలక అంశాలను చర్చించిన రఘురామకృష్ణంరాజు

Satyam NEWS

ఎనాలసిస్: కొందరికే వినసొంపుగా తెలం‘గానం’

Satyam NEWS

1 comment

Yuddandi Siva Subramanyam February 22, 2021 at 10:22 AM

మాతృభాష మీద మీ భావాలు ఆదర్శనీయం,
చాలా బాగుంది మంజులమ్మ గారు.

Reply

Leave a Comment