37.2 C
Hyderabad
May 6, 2024 14: 54 PM
Slider తూర్పుగోదావరి

ఆవ ఎండోమెంట్ కాలనీలోని 54 మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి

#Aava Endowment Colony

రామకృష్ణ థియేటర్ వెనుక ఆవ ఎండోమెంట్ కాలనీలో 12 ఏళ్ళుగా నివసిస్తున్న 54 మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైకాపా నాయకుడు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో రాజమండ్రి హౌసింగ్ ఈఈ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు.పట్టాలు ఇవ్వకుండా తప్పడు నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలని, మా దేవుడు సీఎం జగన్ మాకు న్యాయం చేయాలని వారంతా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మజ్జి అప్పారావు మాట్లాడుతూ 2014 లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 54 మంది పేర్లు తొలగించాలని ప్రయత్నించారని,కొందరు అధికారుల తీరు సరికాదని మండిపడ్డారు.దీనిపై అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ కు వినతిపత్రం ఇస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.ఎంపీ భరత్ దృష్టికి కూడా తీసుకువెళ్ళామని వారందరికీ న్యాయం చేస్తామని చెప్పారన్నారు.అయితే కొందరు హౌసింగ్ అధికారులు సరిగా లేకపోవడం వల్ల ఈ పేదలకు పట్టాలు ఇవ్వడం లేదని మజ్జి అప్పారావు విమర్శించారు.వెంటనే వారందరికీ న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

హైదరాబాద్ లో అమెరికా క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు

Satyam NEWS

రూ.1.99 లక్షల కోట్లు ఏమయ్యాయో సీఎం జగన్ చెప్పాలి

Satyam NEWS

మొక్కలు నాటిన రాష్ట్ర అటవీశాఖ ఛీఫ్ కన్ సర్వేటర్ శోభ

Satyam NEWS

Leave a Comment