28.7 C
Hyderabad
May 5, 2024 08: 24 AM
Slider నల్గొండ

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

#joru

జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం లోని మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన యూనియన్ జిల్లా సమావేశంలో కోలా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇళ్ళ స్థలాల విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.అర్హులైన జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని కోలా డిమాండ్ చేశారు.జిల్లాలో హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.కార్పొరేట్ వైద్యశాలల్లో హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయడం లేదని,ఈ విషయంపై సంబంధిత మంత్రులు చొరవ తీసుకోవాలని అన్నారు.

143 కి రాజీనామాలు ఐజేయులో చేరికలు

కోదాడ పట్టణంలో  143 కి చెందిన  పలువురు ఎలక్ట్రానిక్,ప్రింట్ మీడియా సభ్యులు టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కోలా నాగేశ్వరరావు,ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు గింజల అప్పిరెడ్డి సమక్షంలో చేరారు.ఈ సందర్భంగా వారికి యూనియన్ సభ్యత్వాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల అందరికీ అండగా ఉంటామని అన్నారు.ఏలాంటి ఆపద ఉన్నా జర్నలిస్టులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని అన్నారు.అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ కమిటీని ఎన్నుకున్నారు.

అధ్యక్షుడుగా ఎబిఎన్ గాంధీ,ప్రధాన కార్యదర్శిగా సాక్షి మురళి,కోశాధికారిగా ఎన్ టివి రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.దాడుల నివారణ కమిటీ చైర్మన్ బాదే రాము,ఉపాధ్యక్షుడు గా హరినాథ్ బాబు,జిల్లా కార్యదర్శిగా కోటా రాంబాబు,మల్లం వెంకటేశ్వర్లు,దయాకర్ రెడ్డి,జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ గా సత్యనారాయణ,దాడుల కమిటీ కార్యదర్శిగా కొడారి బ్రహ్మం,జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారిగా పురం శెట్టి వేణు, వాసు,సంపత్,శ్రీను,నాగరాజు,వాసు, దామోదర్ ను ఎన్నుకున్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

వైఎస్ నిర్ణయాన్ని తప్పు పడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి

Satyam NEWS

విద్యార్థినులకు ఎన్.టి.ఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ టెస్ట్

Murali Krishna

బాధితులకు అన్ని వేళల అండగా ఉంటాం

Bhavani

Leave a Comment