38.2 C
Hyderabad
April 28, 2024 20: 33 PM
Slider ఖమ్మం

బాధితులకు అన్ని వేళల అండగా ఉంటాం

#Puvwada Ajay Kumar

ఖమ్మం మున్నేరు వరద ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.నగరంలోని మున్నేరు ముంపు ప్రాంతాలైన వేంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, బొక్కల గడ్డ, మోతీ నగర్ లోని వరద బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో సమకూర్చిన వెయ్యి మందికి సమకూర్చిన నిత్యావసర సరుకులు, స్థానిక కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు అధ్వర్యంలో సమకూర్చిన 6రకాల కూరగాయలను మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు.

పువ్వాడ ఫౌండేషన్ మమత ఆసుపత్రి సంయుక్త అధ్వర్యంలో ఎర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపు ను ప్రారంభించి ఉచిత మందులు పంపిణి చేశారు.ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేని విధంగా మున్నేరు ఉద్రుతీని చూశామని, అయిన ఎక్కడ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలందరినీ కపడుకున్నామని చెప్పారు.

ఇంట్లో నష్టపోయిన వస్తువుల నష్టాన్ని భర్తీ చేసేందుకు మా వంతు సహకారం చేస్తాం.రూ.147 కోట్లతో ఆర్సీసీ వాల్ నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశామని, ముఖ్యమంత్రి కేసీఅర్ గారు దృష్టికి తీసుకెళ్ళమని త్వరలోనే అది మంజూరు చేసి వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.ఇంత కాలం మీరు ఎక్కడికి పోయారు..

కేవలం రాజకీయాల కోసం వచ్చి మాట్లాడటానికి సిగ్గు ఉండాలని అన్నారు.ఎక్కడ ఎలాంటి విపత్తులు జరిగిన ముందు పార్టీ బరాబర్ ఉంటదని స్పష్టం చేశారు. కనీసం కాకర కాయ పంచని వాడు మున్నేరు కు గోడ కట్టిస్తాడంట, చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలు చెపుతారు, వారి మాటలు నమ్మకండి.. వారి వల్ల అయ్యేది ఏమి లేదని, కొన్ని ఏళ్లు మీరు పరిపాలించారు కదా మరి ఏం వెలగపెట్టారో చెప్పాలన్నారు.ఎన్నికల ముందు డ్రామాలు ఆడటానికి వస్తున్నారు, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మీరు కేవలం మీ స్వార్థం కోసం ప్రజల కష్టాలను ఆసరాగా చేసుకుంటున్నారని ద్వజమెత్తారు.

ఖమ్మం ఎల్లలు తెలియని వారు నేడు రాజకీయం చేయడానికి వస్తున్నారని, కనీస అవగాహన ఉంటే ప్రజలకు మేలు జరిగేది అని అన్నారు.పంపిణి చేసిన వారిలో ఎంపి లు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద వున్నారు.

Related posts

ఇంత చైతన్యం ఆనాడు ఉంటే ప్రత్యూషకు న్యాయం జరిగేది

Satyam NEWS

ట్రిబ్యూట్: జర్నలిస్టు మనోజ్ కు కొవ్వొత్తుల నివాళి

Satyam NEWS

ఎన్ని సార్లు గుండె నొప్పి వస్తుది కోడెలా?

Satyam NEWS

Leave a Comment