28.7 C
Hyderabad
May 6, 2024 08: 32 AM
Slider హైదరాబాద్

మంత్రి మేకపాటి ఎలా మరణించారంటే…..

#ministermekapati

సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలపై మంత్రి మేకపాటి కుటుంబం స్పందించింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవం అని కుటుంబ సభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్ లో యథావిధిగా సంతోషంగా గడిపిప మంత్రి మేకపాటి రాత్రి 9.45 కల్లా ఇంటికి చేరారు. జరిగిన విషాదం ఇలా ఉంది:

06.00 గం.లకి రోజూలాగే ఉదయాన్నే మేల్కొన్న మంత్రి.

06:30 గం.ల వరకూ మంత్రిగారు ఫోన్ లతో కాలక్షేపం.

07.00 గం.లకు మంత్రి నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో కూర్చుని ఉన్న మంత్రి మేకపాటి.

07:12కి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పిన మంత్రి  గౌతమ్ రెడ్డి.

07:15గం.లకు  హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి మెల్లిగా కిందకి ఒరిగిన మంత్రి.

7:16 గం.లకు కంగారు పడి గట్టిగా అరిచిన మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి.

07:18 పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతిమీద చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించిన మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావు.

07:20 గం.లకు  మంత్రి మేకపాటి పక్కనే ఉన్న  భార్య శ్రీకీర్తి అప్రమత్తం.

07:20 మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో.. మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచిన భార్య శ్రీకీర్తి.

07:22 “నొప్పి పెడుతుంది కీర్తి” అంటున్న మంత్రి మాటలకు స్పందించి వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరిన మంత్రి సిబ్బంది.

07:27 మంత్రి ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి గల 3 కి.మీ దూరాన్ని, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి చేర్చిన మంత్రి మేకపాటి డ్రైవర్,సిబ్బంది.

08:15 గం.లకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని తెలిపిన అపోలో వైద్యులు.

09:13 గం.లకు మంత్రి మేకపాటి ఇక లేరని నిర్ధారించిన అపోలో ఆస్పత్రి వైద్యులు. 09:15 గం.లకు మంత్రి మేకపాటి చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించిన అపోలో

Related posts

అనకాపల్లిలో ఘోర ప్రమాదం: ఫ్లై ఓవర్ బీమ్ కూలి ఇద్దరు మృతి

Satyam NEWS

ఈ నెల 12న వస్తున్న 1948 – అఖండ భారత్ (the murder of mahathma)

Satyam NEWS

హాక్ ఐ:250 సిసి కెమారాలతో జాతరలో నిరంతర నిఘా

Satyam NEWS

Leave a Comment