30.7 C
Hyderabad
May 13, 2024 00: 29 AM
Slider ఖమ్మం

బీఆర్ఎస్ లో టికెట్ల సర్దుబాటు ఎలా?

#KCR

18న ఖమ్మం బీఆర్ఎస్ సభ సక్సెస్ కోసం మునుగోడు ఉప ఎన్నిక రేంజ్ లో ఎఫెక్ట్ పెట్టారు. మునుగోడు లో గెలిచినట్లుగానే ఖమ్మం సభ కూడా సక్సెస్ అవుతుంది. సభ విజయవంతం కోసం ఇప్పుడు తిరిగే వారందరికీ ఈ 2023 లోనే జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశావాహులు అందరికీ టికెట్లు లభించినట్లేనా!? ప్రధాన పోటీ దారుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని, అతని అనుచరులను ప్రక్కకు తప్పించినా టికెట్ల పోటీ తీవ్రంగానే ఉండనుంది కదా! ముందుగా పాలేరు నే తీసుకుందాం.

మునుగోడు లో సహాకరించిన సీపిఎం, జాతీయ రాజకీయాల్లో ఉపయోగపడేందుకు వస్తున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. అంటే పొత్తులో భాగంగా సిపిఎం వారికి పాలేరు అసెంబ్లీ స్థానాన్ని కెటాయిస్తున్నారా? లేక ఇటీవల సిట్టింగ్ లకే టిక్కెట్లు అన్నారు. అందులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా టికెట్ ఇస్తున్నారా! లేకపోతే తమ్మినేని కృష్ణయ్య హత్య సమయంలో దూరం పెట్టి ఇటీవల మళ్ళీ బాగా దగ్గరకు తీస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు ఇస్తున్నారా? ప్రతి ఒక్కరిలోనూ ఇదో ఫజిల్ వీడడం లేదు. కొత్తగూడెం కూడా చూద్దాం.

మునుగోడు లో బాగా సహాకరించిన వారిలో సిపిఐ పార్టీ ముందంజలో ఉంది. రేపు జాతీయ రాజకీయాల్లోనూ బాగానే ఉపయోగపడతారు. అందుకోసం ఖమ్మం సభకు సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.రాజా కూడా వస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు అంటూ కుదిరితే సిపిఐ పార్టీ కోరుకునే స్థానాల్లో కొత్తగూడెం అసెంబ్లీ సీటు ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అది వారికి కెటాయిస్తారా? లేక సిట్టింగ్ లకే టిక్కెట్లు అన్నారు కదా, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కు కూడా టికెట్ ఇస్తున్నారా? 2014 లో ఒకే ఒక్కడు, మీ కారు గుర్తు పై గెలిచి, ఇంకా ఏ తప్పటడుగు వేయకుండా మీ వెన్నంటే ఉంటూ టికెట్ ఆశిస్తున్న జలగం వెంకట్రావు కి ఇస్తున్నారా? లేక రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు కొత్తగూడెం టికెట్ పై కన్నేసి మంచి జోరుమీద కొత్తగూడెం ను చుట్టేస్తున్నారు.

వీరికి కూడా టికెట్ ఇస్తున్నారా! అంటే పాలేరు లో ముగ్గురు, కొత్తగూడెం లో నలుగురు అన్నమాట. అదే విధంగా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఇద్దరూ ఉండనే ఉన్నారు. ఖమ్మం సభ నైతే సక్సెస్ చేస్తారు కానీ తర్వాత ఇన్ని చిక్కు ముడులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలా విప్పుతారో వేసి చూడాల్సిందే.

తుమ్మలపల్లి ప్రసాద్, సీనియర్ జర్నలిస్టు

Related posts

వైఎస్ మరణంపై  జగన్ ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరలేదు

Satyam NEWS

కఠిన చర్యలు తీసుకోకుంటే.. మూడో వేవ్

Sub Editor

వివాహ భోజనంబు’లో తొలి పాట ‘ఎబిసిడి…’ విడుదల

Satyam NEWS

Leave a Comment