35.2 C
Hyderabad
April 27, 2024 12: 17 PM
Slider ప్రకాశం

వైఎస్ మరణంపై  జగన్ ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరలేదు

#gidugurudraraju

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతిపై సీఎం జగన్  మోహన్ రెడ్డి చట్టసభల్లో ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు  ప్రశ్నించారు. ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ మరణంపై వైసీపీ నేతలు చేసిన అర్థరహిత ఆరోపణలు సరికాదన్నారు. వైఎస్ మరణంపై తమకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. జగన్ ఇప్పటి వరకు బీజేపీకి మద్దతుగా ఉండి కూడా సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరలేదని నిలదీశారు. వైఎస్ వివేకా మరణంపై కూడా ముఖ్యమంత్రిగా ఉండి జగన్ ఆ కేసును ఏం చేశారని నిలదీశారు. నిజమైన వైఎస్ వారసులుగా ఆయన మరణంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. వైఎస్ మరణంపై మొదట రిలయన్స్‌ని అనుమానించి ముఖేష్ అంబానీ చెప్పిన వ్యక్తిని రాజ్యసభ సభ్యుడిగా జగన్ చేశాడని మండిపడ్డారు. జగన్ మానసిక స్థితి చూసిన తర్వాత తమకు అనుమానాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరూ సంతృప్తిగా లేరని అన్నారు. త్వరలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న నేతలు తిరిగి హస్తం గుటికి చేరే అవకాశం ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాష్ట్రానికి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తారని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

Related posts

ఎంత మంది బాధితులొచ్చినా చికిత్సకు ఏర్పాట్లు చేయాలి

Satyam NEWS

బాలికతో వ్యభిచారం కేసులో మరో అయిదుగురి అరెస్టు

Satyam NEWS

పంజాబ్ సీఎం చన్నీపై మీటూ ఆరోపణలు

Sub Editor

Leave a Comment