27.7 C
Hyderabad
May 11, 2024 08: 35 AM
Slider నెల్లూరు

కోవిడ్ ప్రభావిత వ్యక్తుల్లో ఆత్మస్థైర్యం నింపాలి

#VikramSimhapuri

గ్రామీణాభివృద్ధికి ఎన్ యస్ యస్ వాలంటీర్లు కృషి చేయాలని నెల్లూరు జిల్లా జిల్లా కలెక్టర్ కె వి యన్. చక్రధర్ బాబు అన్నారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కోవిడ్ ప్రభావిత వ్యక్తుల్లో స్థైర్యాన్ని నింపేందుకు మార్గదర్శకాలు అనే అంశం మీద ఒక్క రోజు వర్కుషాప్ జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కోవిడ్ సంక్షోభంలో వున్న పేద కుటుంబాలకు ఎన్ యస్ యస్ వాలంటీర్లు చేయూత నివ్వాలని కోరారు.

ఇటువంటి వర్కుషాప్ ను ఏర్పాటు చేసినందుకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ జిల్లా కోవిడ్ సంక్షోభంలో ఎన్ యస్ యస్  వాలంటీర్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.

అలాగే కోవిడ్ సమయంలో మానసిక కౌన్సిలింగ్ ప్రాముఖ్యతను తెలియపరిచారు.  కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్ అధ్యక్షత వహించి వర్క్ షాప్ ముఖ్యఉద్దేశాలను తెలియచేసారు.

రిసోర్స్ పర్సన్ డా. దేవి నాయర్ కోవిడ్ పేషెంట్స్ కు ఏ విధంగా మానసికంగా అలాగే  అత్యవసర పరిస్థితులలో సహాయం చేయగలం  అని అనేక అంశాల మీద అవగాహన కల్పించారు.

కోవిడ్ విపత్కర పరిస్థితులలో ఉపాధి అవకాశాలను పెంపొందించే  విధంగా ఎన్ యస్ యస్  వాలంటీర్లు కృషి చేయాలని సూచించారు. 

కొన్ని టీమ్స్ గా ఏర్పడి కోవిడ్ వ్యాధివల్ల నిస్సయతా, నిరుత్సాహముగా వున్న వారికి హాస్పిటల్ బెడ్స్, ఐసీయూ, వెంటిలేటర్స్, టీకా ల గురించి వివరాలు తెలియపరచటం చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే అత్యవసర సేవలు అందించు స్వచ్చంద సంస్థల గురించి, హెల్ప్ లైన్ నంబర్స్  గురించి వివరాలు తెలియపరచటం, కోవిడ్ ప్రభావిత కుటుంబాలకు, చిన్న పిల్లలకు పెద్దలకు చేయూత నివ్వటం, ఇంటి వివిక్త రోగులకు  టెలిమెడిసిన్ ఆన్ లైన్లో డాక్టర్ ను సంప్రదించటం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  వర్క్ షాప్ కార్యనిర్వాహకుడు, ఎన్ యస్ యస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ విద్యా పరిషద్ కో ఆర్డినేటర్ సాయి కిరణ్, డా.కె.సునీత, డా.మధుమతి, డా.ఆర్.ప్రభాకర్, డా.వై విజయ, పిఆర్ఓ డా.నీల మణికంఠ, రెండువందల మంది ఎన్ యస్ యస్ ప్రోగ్రాం అధికారులు, ఎన్ యస్ యస్ వాలంటీర్లు, కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే

Satyam NEWS

శివ సాయి నగర్ కాలనీలో… రోడ్డు కబ్జాపై మాజీ కౌన్సిలర్ ఫిర్యాదు

Bhavani

మరో పూణేగా మారుతున్న వరంగల్ సిటీ

Satyam NEWS

Leave a Comment