33.2 C
Hyderabad
May 4, 2024 01: 25 AM
Slider ప్రత్యేకం

కట్టలు తెగిన కరెన్సీ.. ఓటుకు రూ.3 వేలు!

#hawala cash

ఒక్కో నియోజకవర్గంలో రూ.50-100 కోట్ల వ్యయం: ఇప్పటికే కీలక నేతలఇళ్లకు చేరిన నగదు!

రాజధానిలో ఓటుకు నోటు పంపిణీ షురూ అయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు. మరికొన్నిచోట్ల మాత్రం పోలింగ్‌కు రెండు రోజుల ముందు పంపిణీ కోసం పోలీసుల కంటపడకుండా నగదును కీలకమైన నేతల ఇళ్లకు చేర్చారు. ఈ నెల 28, 29 తేదీల్లో పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలు పడి డబ్బులు సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల మూడు పార్టీలు కలిసి దాదాపు రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది..

మరికొన్నిచోట్ల మాత్రం పోలింగ్‌కు రెండు రోజుల ముందు పంపిణీ కోసం పోలీసుల కంటపడకుండా నగదును కీలకమైన నేతల ఇళ్లకు చేర్చారు. ఈ నెల 28, 29 తేదీల్లో పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలు పడి డబ్బులు సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల మూడు పార్టీలు కలిసి దాదాపు రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది..

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

మూడు జిల్లాల పరిధిలోని 29 నియోజకవర్గాల్లో సుమారు రూ.1500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు నగదు పంపిణీ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు తమ దగ్గరున్న నగదును నియోజకవర్గంలోని కీలక నేతల ఇళ్లకు చేర్చారు. ఒకవేళ పోలీసులు పట్టుకున్నా పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే తమ వైపు నుంచి ఓటర్లకు డబ్బు చేరేలా ప్రణాళిలు రూపొందించుకున్నారు. అవసరమైతే రెండో విడత పంపిణీకి కూడా కొందరు సిద్ధమవుతున్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

No sand: పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేత

Satyam NEWS

పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు

Bhavani

రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు

Satyam NEWS

Leave a Comment