38.2 C
Hyderabad
May 2, 2024 22: 43 PM
Slider తూర్పుగోదావరి

కాకినాడ జంగం సంఘం కమ్యూనిటీ హాలుకు స్థలం

#kakinadamla

కాకినాడ శివారులోని కొండయ్య పాలెం రోడ్డులో జంగమ కులంతో పాటు మరో 40 కుల సంఘాలకు కమ్యూనిటీ హాలుల నిర్మాణం నిమిత్తం స్థలాలను మంజూరు చేయనున్నట్లు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం కాకినాడలో జరిగిన జంగం సంక్షేమ సంఘం వనభోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే దారం పూడి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఎకరాల స్థలాన్ని కుల సంఘాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం నిమిత్తం కేటాయించామన్నారు. దానికి వైఎస్ఆర్ కమ్యూనిటీ కాంప్లెక్స్ గా నామకరణం చేశామని, రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది అన్నారు. ఈ సంవత్సరమే 40 కుల సంఘాలకు స్థలాన్ని కేటాయించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జంగం కులస్తులు తనను అభిమానంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

జంగం కుల సంఘ నేతల విజ్ఞప్తి మేరకు అన్ని కులాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాలను కేటాయించనున్నట్లు తెలిపారు. జంగమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చప్పిడి గంగాధరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పైడికొండల నాగేశ్వరరావు కాకినాడ పట్టణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ మూర్తి మాట్లాడుతూ  కమ్యూనిటీ హాల్ నిమిత్తం స్థలాన్ని కేటాయించాలని కోరారు.

ఎంబిసి కులాలకు ఉచిత విద్యుత్ జీవో అమలు చేయాలి

ఆంధ్ర ప్రదేశ్ జంగమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాటి గంగాధర్ మాట్లాడుతూ ఎంబీసీ కులాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జంగములు సమైక్యంగా రాజకీయంగా ఎదగాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేర్చుకోవాలని కోరారు. జంగమ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చప్పిడి గంగాధర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పధకాలు చాలా మంది జంగమ కులస్తులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జంగమ కార్పొరేషన్ చైర్మన్, సభ్యులు తగిన చర్యలు తీసుకొని జంగమలందరికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సంచార జాతుల జాబితా నుంచి జంగమ తీసివేయడం పట్ల ఆవేదన చెందారు. తిరిగి జంగం కులాన్ని సంచార జాతులలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జంగమ కులస్తుల సమస్యలు  తీర్చకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష కైనా సిద్ధమని  హెచ్చరించారు.

శ్రీశైలంలో జంగం సత్రానికి స్థలాన్ని కేటాయించాల్సిందిగా కోరారు. జంగం సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కొండల నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ల పనితీరుపై చైర్మన్, డైరెక్టర్లల  నుండి ప్రతి నెల నివేదికలు ప్రభుత్వం కోరాలని సూచించారు. జంగమల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలని కోరారు. 

తమకు స్థలాన్ని కేటాయిస్తే వెంటనే కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఐక్య జంగమ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు పూతి కోటేశ్వరరావు మాట్లాడుతూ జంగమలు తమ సమస్యలను పరిష్కరించడానికి అందరూ కలిసి రావాలన్నారు. 

ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి బి.ఎన్ శివయ్య, తాడేపల్లి సంఘం అధ్యక్షుడు లోకనాథం ఉమాశంకర్, జంగం కార్పొరేషన్ డైరెక్టర్ మీగడ శ్రీనివాస్,  రాష్ట్ర కార్యదర్శి తూము రత్నశేఖర్, కాకినాడ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మూర్తి,కార్యదర్శి ద్విపాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.  రాష్ట్ర కార్యదర్శి జటా చిట్టిబాబు రూపొందించిన 2024 జంగం సంఘం క్యాలెండర్ ను రాష్ట్ర జంగం సంఘం నాయకులు ఆవిష్కరించారు.

Related posts

అగ్రిగోల్డ్ లే-అవుట్ సంస్థకు నోటీసులు

Satyam NEWS

టమాటాలు ఎట్టుకెళ్లిన దొంగలు

Bhavani

శ్రమిస్తే విజయం వారి సొంతమవుతుంది:మంత్రి నిరంజన్

Satyam NEWS

Leave a Comment