38.2 C
Hyderabad
May 2, 2024 22: 37 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఎం.వి.ఐ.కి వినతి పత్రం

#MVI

తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం పిలుపు మేరకు పెరిగిన ఫిట్నెస్ ,గ్రీన్ టాక్స్ వివిధ రకాల సమస్యల పై కోదాడ ఎం.వి.ఐ.కి హుజూర్ నగర్ లారీ యజమానుల సంఘం ప్రతినిధులు మెమోరాండం అందజేశారు. రవాణా రంగం జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగపై ఆధారపడిన కుటుంబాల నడ్డి విరుస్తు టాక్సీల పెంపుపై నిరంకుశంగా అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ మూడు రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా అధికారుల ద్వారా సమస్యలపై రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకుల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేసి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి చేరేలా సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా లారీ యజమానుల సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ రవాణా రంగ జేఏసీ పిలుపు మేరకు 17వ,తేదీన లారీ అసోసియేషన్ లో  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దగ్ధం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు,19వ,తేదీన ఖైరతాబాద్ లో రాష్ట్ర రవాణా రంగ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి లారీల యజమానులు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నల్గొండ జిల్లా సంఘం గౌరవ అధ్యక్షుడు పైడిమర్రి వెంకట నారాయణ,నల్లగొండ జిల్లా సంఘం గౌరవ సలహాదారుడు నరసరాజు, నల్గొండ జిల్లా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రామారావు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కోతి సంపత్ రెడ్డి, కోదాడ అధ్యక్షుడు కనగాల నాగేశ్వరావు,హుజూర్ నగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సంజీవరెడ్డి,అధ్యక్షులు గోళ్ళ శంకర్రావు, సెక్రటరీ కె వి.ప్రతాప్,వైస్ ప్రెసిడెంట్ రామిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బస్తీ దవాఖానతో ప్రతి ఒక్కరికి మేలు

Satyam NEWS

జనసైనికులకు ‘‘రక్షణ గోడ’’ లీగల్ సెల్

Satyam NEWS

భక్తులకు ఎలాంటి సౌకర్యం కల్పించని మునిసిపల్ అధికారులు

Satyam NEWS

Leave a Comment