27.7 C
Hyderabad
April 30, 2024 09: 46 AM
Slider నల్గొండ

మూడవ వార్డులోని పలు సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో సూచనలు

#municipal

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో మూడో వార్డు,పట్టణంలో పలు సమస్యలపై చర్చ జరిపి సూచనలు చేశారు మూడో వార్డ్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి.

ఈ సందర్భంగా కౌన్సిల్ సమావేశంలో మూడో వార్డు కౌన్సిలర్ కోతిసంపత్ రెడ్డి మాట్లాడుతూ మూడో వార్డులో ప్రధాన రహదారులైన ఎన్జీవోస్ కాలనీ,ప్రధాన సీసీ రోడ్డు,చైతన్య స్కూల్ వరకు మెయిన్ సీసీ రోడ్డు నిర్మాణాలను నూతనంగా నిర్మించాలని ప్రతిపాదన చేశారు.రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మూడవ వార్డ్ ఎన్జీవోస్ కాలనీ ఆనుకొని ఉన్న ఎన్ ఎస్ పి కెనాల్ కట్ట దెబ్బతిన్న ప్రాంతాల్లో మట్టిని తోలించాలని కోరారు.3వ,వార్డులో నూతనంగా ఇంటి నిర్మాణాలు ఎక్కువగా చేపడుతుడటంతో విద్యుత్ వినియోగం ఎక్కువ అవడంతో లో – వోల్టేజ్ సమస్యతో వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు,సంబంధిత విద్యుత్ శాఖతో చర్చించి కావాల్సిన నిధులను కేటాయించి నిరుపయోగంగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వినియోగంలోకి తీసుకురావాలని కోరినట్లు తెలిపారు.మూడో వార్డులో ఉన్నటువంటి కొత్త బస్టాండ్ లో సుమారు మూడు సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులతో నిర్మాణం చేపట్టిన ప్రజా మరుగు దొడ్లకి వాచ్ మాన్ ను కేటాయించి వినియోగంలోకి తీసుకురావాలని కోరినట్లు,నూతనంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో 10 శాతం భూమిని మున్సిపాలిటీ కేటాయించకుండానే అమ్మకాలు కొనుగోలు జరుపుతున్నారని, గతంలో మున్సిపాలిటీకి కేటాయించిన భూములను కాపాడడంలో అధికారులు విఫలమవుతున్నారని,ఇట్టి విషయాన్ని ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

పార్లమెంట్ సభ్యుడు నలమాద ఉత్తంకుమార్ రెడ్డి నిధులతో హుజూర్ నగర్ పట్టణంలో వివిధ వార్డుల్లో కేటాయించిన అంగన్వాడి స్కూల్స్, కమ్యూనిటీ హాల్స్ కి కావాల్సిన స్థల సేకరణకి మున్సిపల్ తీర్మానం చేసి కలెక్టర్ కి పంపవలసిందిగా కౌన్సిల్ ను కోరినట్లు తెలిపారు.ఈ సమావేశంలో మూడో వార్డులో అత్యవసరంగా నిర్మాణం చేయవలసిన డ్రైనేజీ పనులకు సుమారు 5 లక్షల రూపాయలను కేటాయించడం జరిగినదని తెలియజేశారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఔత్సాహిక టెక్కీలకు టీటా స‌భ్య‌త్వ‌ ఆహ్వానం

Sub Editor

సమన్వయంతో ముందుకు సాగుదాం

Satyam NEWS

ఏపీజే అబ్దుల్ కలాం 8 వ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment