29.7 C
Hyderabad
May 4, 2024 04: 03 AM
Slider ముఖ్యంశాలు

మతిస్థిమితం లేని వృధ్ధురాలిని ఆదుకున్న లేడీ హోమ్ గార్డు

#VijayanagaramPolice

సరిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున డీఐజీ గా పదోన్నతి పొందిన విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ ఇచ్చిన స్పూర్తితో నే తాను మతిస్థిమితం లేని వృధ్ధురాలిని సహాయం అందించానని బొబ్బిలి కి చెందిన హోమ్ గార్డు ఝాన్సీ రాణి అన్నారు.

మతిస్థిమితం లేని ఓ వృధురాలు మెడలో గొలుసులేసుకున్న అవి తీసుకునేందుకు అవస్థలు పడుతుండటాన్ని గుర్తించి న హోమ్ గార్డు తక్షణం స్పందించి ఆవడను మామూలు మనిషి అయ్యేలా చేసింది.

అది కాస్తా సోషల్ మీడియా ద్వారా వార్త హల్ చల్ చేసి చివరకు ఎస్పీ వరకు చేరింది. తక్షణం ఆ హోమ్ గార్డ్ ను తన బంగ్లాకు పిలిపించి.. ప్రశంసా పత్రంతో పాటు నగదు ను అందించారు. ఈ సందర్భంగా హోమ్ గార్డు.. ఎస్పీ కాళ్లకు దండం పెట్టి మరీ…మీరిచ్చిన స్పూర్తితో నే నా సేవాగుణం…మానవత్వం మేల్కొందని హోమ్ గార్డు పేర్కొనడం విశేషం.

ఏదైనా…ఆ మధ్య ఓ ఏర్ కానిస్టేబుల్, అలాగే ఓ పీసీ ,ఇప్పుడు తాజాగా ఓ హోమ్ గార్డ్. ఇప్పుడు ఎస్పీ పదోన్నతి వచ్చి వెళ్లిపోతున్నారన్న వార్తలు.. శాఖలో మరీ ముఖ్యంగా లేడీ సిబ్బందికి ఒకింత… బాధాకరమనే చెప్పటానికి హోమ్ గార్డు ఝాన్సీ రాణి తాజా ఉదాహరణ అని చెప్పాలి.

ఎం. భరత్ కుమార్, సత్యం న్యూస్

 

Related posts

హైదరాబాద్‌లోబజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హోమ్స్ అండ్ లోన్స్ ఫెస్టివల్‌

Satyam NEWS

గో మాత ను రక్షిoచుకోవడం మన హక్కు, మన బాధ్యత

Satyam NEWS

అంబరాన్నంటిన “అట్లాంటా-నెల్లూరు” సాంస్కృతిక సంబరాలు

Satyam NEWS

Leave a Comment