బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బిహెచ్‌ఎఫ్ఎల్) హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అమ్మకందారులను, కొనుగోలుదారులను ఒకచోట చేర్చింది. రూ .30 లక్షల నుంచి మొదలుకొని ఆ పై విలువతో కూడుకున్న హోమ్స్ అండ్ లోన్స్ ఫెస్టివల్ దేశంలో అతిపెద్ద డెవలపర్ల భాగస్వామ్యాన్ని కలిగిఉంది. బిహెచ్ఎఫ్ఎల్ 8.55% వార్షిక వడ్డీ రేటు మొదలుకొని ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు పై మినహాయింపు ఉంటుంది. కొనుగోలుదారులకు బిహెచ్ఎఫ్ఎల్ తో పాటు డెవలపర్ల నుండి ఆన్-స్పాట్ ఆఫర్లు, అప్రూవల్స్ లభిస్తాయి. లక్కీ విజేతలకు 10 గ్రాముల బంగారు వోచర్ లభిస్తుంది. కార్యక్రమ వివరాలు: తేదీ- 2019 నవంబర్ 23 మరియు 24. వేదిక: రాడిసన్ హైటెక్ సిటీ, కొండపూర్, హైదరాబాద్. డెవలపర్ల వివరాలు: జాతీయ స్థాయి: గోద్రేజ్, పూర్వంకర, షాపూర్జీ పల్లోంజీ. స్థానికం: త్రిషల, యునైటెడ్ అవెన్యూస్, మోడీ ప్రాపర్టీస్, సాకేత్. బిహెచ్‌ఎఫ్‌ఎల్ తెలంగాణ రెరా నంబర్- ఎ 02500000176. శీఘ్ర మరియు తిరుగులేని పంపిణీ ప్రక్రియలకు బిహెచ్ఎఫ్ఎల్ పేరుగాంచింది. గృహరుణం, ఫ్లెక్సిబుల్ లోన్ కాలపరిమితి మరియు ఆన్‌లైన్ అకౌంట్ మేనేజ్‌మెంట్ వంటి కొన్ని ప్రత్యేకమైన విశిష్టతలను కలిగి ఉంది. బిహెచ్‌ఎఫ్‌ఎల్ ఇల్లు కొనడానికి, సొంత ఇంటిని నిర్మించడానికి లేదా ప్రస్తుత ఇంటిని పునరుద్ధరించడానికి రూ.3.5 కోట్ల దాకా హోమ్ లోన్ అందిస్తోంది. మరమ్మతులు మరియు పునర్నిర్మాణం వంటి ముఖ్య అవసరాలకు ఆర్థిక సహాయం చేయడానికి కంపెనీ తన వినియోగదారులకు హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీపై టాప్-అప్ రుణం అందిస్తుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) (అర్బన్) కింద నమోదు చేసిన రుణ సంస్థలలో బిహెచ్‌ఎఫ్ఎల్ కూడా ఒకటి. అర్హత ప్రమాణాల ఆధారంగా నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
previous post