Slider రంగారెడ్డి

జాతీయ స్థాయిలో ఐసీఏఆర్ 14వ ర్యాంకు గ‌ర్వ‌కార‌ణం

icar ranker

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన భార్గవి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ జాతీయ స్థాయిలో 14 వ ర్యాంక్ సాధించడం తాండూరు బిసిలకు గర్వకారణమని నియోజకవర్గ బిసి సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం పాత తాండూర్ కోటేశ్వర దేవాలయంలో సీ.హెచ్. భార్గవిని తాండూర్ బి.సి సంఘం ఆధ్వ‌ర్యంలో ఘనంగా సన్మానించారు.


కుల వృత్తులు చేసుకునే కుటుంబానికి చెందిన భార్గవి ఈ స్థాయిలో రాణించడానికి ప్రోత్సహించిన తల్లి తండ్రులను ఆయన అభినందిoచారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, లలిత, లావణ్య, మధుబాల, బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు శెట్టి భాస్కర్, బీసీ కులాల జిల్లా మహిళా అధ్యక్షురాలు సౌజన్య, టి పి టి ఎఫ్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, నర్సింలు, రమేష్, ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్ ఎర్రం శ్రీధర్, గుండప్ప, మంతటి రాజు, సురేష్, భీమ్, మోహన్ కృష్ణ గౌడ్, బిజెపి నాయకులు బంటారం భద్రేశ్వర్, జుంటుపల్లి వెంకటేష్, దత్తాత్రేయ, అశోక్,శ్రీకాంత్ రెడ్డి, రాచప్ప, భార్గవి తల్లిదండ్రులు రవీందర్, సువర్ణ, తాతయ్య బాలానందం వేదిక్ విశిష్ట పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టుల సంక్షేమానికి ముందుంటా : ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి

Bhavani

ఓదెల రైల్వేస్టేషన్’ వశిష్ట సింహ లుక్ విడుదల

Sub Editor

పోలీస్, ప్రెస్ దొంగ స్టిక్కర్లతో తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment