38.2 C
Hyderabad
May 5, 2024 22: 09 PM
Slider ఖమ్మం

భూ సమస్యలు గుర్తించండి

#khammamdc

గ్రామాల్లో బల్క్ భూ సమస్యలు గుర్తించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లో రెవిన్యూ అధికారులతో ఖమ్మం జిల్లాలోని భూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లో ని గ్రామాల్లో బల్క్ భూ సమస్యలు ఉన్నట్లు, ఇట్టి సమస్యలు గుర్తించడం చాలా ముఖ్యమని అన్నారు. బల్క్ సమస్యలకు చెందిన భూమి ధరణి పోర్టల్ లో ఏ స్టేటస్ లో ఉందో అర్థం చేసుకోవాలని, అట్టి స్టేటస్ ననుసారించి ఎలా పరిష్కరించాలో కార్యాచరణ చేయాలన్నారు. ధరణి లో అన్ని సమస్యల పరిష్కారం ఉన్నట్లు ఆయన తెలిపారు. రికార్డుల నిర్వహణ చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే తాళ్లపెంట, మందాలపాడు, లంకపల్లి, బేతుపల్లి, జమలాపురం గ్రామాల్లో పరిష్కరించిన బల్క్ సమస్యలు సంబంధిత తహశీల్దార్లు ఎలా పరిష్కరించారో మిగతా వారికి అవగాహన కల్పించారు. ప్రస్తుతం గుర్తించిన బల్క్ సమస్యల స్టేటస్, ఏ ఏ చర్యలు చేపట్టి పరిష్కరించాలో చర్చించిన కలెక్టర్ తహశీల్దార్లకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, తహశీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎలర్ట్: గచ్చిబౌలి లో మరో క్వారంటైన్ సెంటర్

Satyam NEWS

తిరుపతిలో అదృశ్యమైన బాలుడి కథ సుఖాంతం

Satyam NEWS

ఒడిశా రైలు ప్రమాదంపై నవతరంపార్టీ దిగ్భ్రాంతి

Bhavani

Leave a Comment