27.7 C
Hyderabad
May 11, 2024 08: 39 AM
Slider చిత్తూరు

తిరుపతిలో అదృశ్యమైన బాలుడి కథ సుఖాంతం

#TirupatiPolice

అలిపిరి బాలుడి కిడ్నాప్ కేసును సుఖాంతం అయింది. తిరుపతి పోలీసుల బృందం బాలుడిని తల్లిదండ్రులు చెంతకు చేర్చారు. అర్బన్ ఎస్ పి వెంకట అప్పల నాయుడు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఛత్తీస్ గఢ్ లో గరియాబాద్ నుంచి 55 మంది విహార యాత్రలో భాగంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. విజయవాడ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలు దర్శించుకుని ఆ బృందం తిరుపతికి వచ్చింది.

దర్శన టికెట్లు లేకపోవటంతో అలిపిరి లింక్ బస్ స్టాండ్ లో బస చేశారు. అక్కడ ఫిబ్రవరి 27న బాలుడు శివకుమార్ సాహు అదృశ్యమయ్యాడు.

తన కుమారుడు కనిపించటం లేదని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి అదృశ్యం కు  సంబంధించిన ఆధారాలు దొరక్కపోడంతో  పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. బాలుడి కోసం రాష్ట్రంతో పాటు, కర్ణాటక,తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

శనివారం విజయవాడ లో బాలుడి ఆచూకీ లభించింది. సాంకేతిక సహాయంతో కిడ్నాపర్ కర్ణాటక లోని కోలార్ జిల్లా,నగిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్టనహళ్ళి కి చెందినవాడిగా గుర్తించామని అర్బన్ ఎస్ పి వెంకట అప్పల నాయుడు తెలిపారు.

Related posts

కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి

Bhavani

రేపు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద భాజపా ధర్నా

Satyam NEWS

రెవెన్యూ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment