29.7 C
Hyderabad
May 4, 2024 06: 21 AM
Slider ఖమ్మం

భర్త పెన్షన్ పొందుతూ మరణిస్తే భార్యకు వెంటనే పెన్షన్

#Gautham

వృద్దాప్య పెన్షను పొందుతూ ఎవరైనా మరణిస్తే, వారి స్థానంలో వారి భార్య వయస్సు 57 సంవత్సరాలు ఉంటే వృద్దాప్య పెన్షన్, 57 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే వితంతు పెన్షన్ వెంటనే మంజూరు అవుతుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

కలెక్టర్ రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెం గ్రామ పంచాయతీ సందర్శించి, వి. వెంకటాయపాలెం గ్రామానికి సంబంధించి వృద్దాప్య పెన్షను పొందుతూ మరణించిన వారి విషయంలో వారి భార్యలకు పెన్షన్ మంజూరు విషయంలో తీసుకున్న చర్యల గురించి రికార్డులు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్దాప్య పెన్షన్ పొందుతున్న వారు మరణిస్తే, అట్టి వారి విషయంలో అధికారులు వెంటనే వారి భార్యకు పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వి. వెంకటాయపాలెం గ్రామంలో ఆగస్టు 2022 నుండి ఆగస్టు 2023 వరకు 34 మరణాలు సంభవించగా, వీరిలో 12 మంది ఆసరా పెన్షన్ పొందుతున్న వారు ఉండగా, వీరిలో 5 గురు దంపతులిద్దరూ మరణించినట్లు తెలిపారు. మిగతా 7 గురిలో ఒక కేసు మాత్రమే ఇన్ స్టాన్ట్ పెన్షన్ కోసం దరఖాస్తు చేయగా, మిగతా 6 గురు దరఖాస్తు చేయాల్సివుందన్నారు.

మరణ నమోదులు జరగని వారు ఇంకనూ ఉండవచ్చని ఆయన తెలిపారు. మొత్తం వృద్దాప్య పెన్షన్ పొందుతున్న జాబితా తీసుకొని, వారిలో ఈ మధ్య కాలంలో తొలగించిన వారి పేర్లు సరిచూడాలని, అట్టి తొలగించిన వారి స్థానంలో ఇన్ స్టాన్ట్ పెన్షన్ మంజూరు జరిగిందా పరిశీలించాలని అన్నారు. ఒక్క కేసు కూడా పెన్షన్ పొందకుండా నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇప్పటివరకు ఈ అవకాశం వినియోగించకుండా ఉన్న వారు వెంటనే సంబంధిత మండల పరిషత్ కార్యాలయం,మునిసిపాలిటీ కార్యాలయం,డిఆర్డీఓ కార్యాలయం, ఖమ్మం లో దరఖాస్తు సమర్పించాలన్నారు.

దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మరణించిన వృద్దాప్య పెన్షన్ దారుని మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతులను జతచేయాలన్నారు.

పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్లు 7330666181, 8978604953 లను సంప్రదించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా జెడ్పి సిఇఓ అప్పారావు, డిఆర్డీఓ విద్యాచందన, అదనపు డిఆర్డీఓ జయశ్రీ, రఘునాథపాలెం ఎంపీఓ శ్రీనివాస రెడ్డి, డిపీఎం రేవతి, వి. వెంకటాయపాలెం సర్పంచ్ మాధవి, ఎంపిటిసి హన్మంతరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, అధికారులు తదితరులు ఉన్నార

Related posts

డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

భారీగా అంబర్ గుట్కా స్టాక్ పట్టుకున్న వర్థన్నపేట పోలీసులు

Satyam NEWS

వితంతువులకు ప్రత్యేక మహిళాశాఖ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment