38.2 C
Hyderabad
May 3, 2024 20: 28 PM
Slider వరంగల్

భారీగా అంబర్ గుట్కా స్టాక్ పట్టుకున్న వర్థన్నపేట పోలీసులు

#WardhannapetPolice

వర్థన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పర్ పల్లి క్రాస్ రోడ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు భారీ ఎత్తున అంబర్ గుట్కా దొరికింది.

కానిస్టేబుల్ బుచ్చిరాజు, హోంగార్ద్ రమేష్ ప్రెటోలింగ్ విధులు నిర్వహిస్తూన్న సమయంలో అనుమానస్పదంగా వస్తున్న ఆటోను తనీఖీ చేయగా ఇది బయటపడింది.

నిషేధిత గుట్కా, అంబర్ బ్యాగులను అక్రమ రవాణా చేస్తున్న ఆటో డ్రైవర్ పర్వతగిరి మండలం, వడ్లకొండ ప్రాంతానికి ఇబ్రహింను అదుపులోకి 1లక్ష 50వేల రూపాయల విలువగల పోగాకు ఉత్పత్తులను  స్వాధీనం చేసుకున్నారు.

వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. గుట్కాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని  వర్థన్నపేట ఎ.సి.పి రమేష్ కుమార్,సర్కిల్ ఇన్స్ స్పేక్టర్ విశ్వేశ్వర్, వర్థన్న పేట ఎస్.ఐ వంశీకృష్ణ అభినందించారు.

Related posts

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను భారతీయ ప్రజలు వ్యతిరేకించాలి

Satyam NEWS

బతికేందుకు భయంగా ఉంది రక్షణకు రైఫిల్ ఇవ్వండి

Satyam NEWS

కౌంటర్ చెక్: పోలీసు పైశాచికత్వంపై విచారణ షురూ

Satyam NEWS

Leave a Comment