31.7 C
Hyderabad
May 2, 2024 09: 20 AM
Slider నల్గొండ

డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

#dsrtrust

ప్రపంచంలోకెల్లా అతి పెద్దది, చైతన్యవంతమైన ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్న భారతీయులందరికీ 74వ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు తెలిపారు. ఈ సందర్భంగా డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ 1947లో బ్రిటీష్ రాజ్యం నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని,కానీ అప్పటికి మనకు సొంత రాజ్యాంగం లేదు,73 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత ప్రజలమైన మనం మన కోసం మనకు మనమే విశిష్టమైన రాజ్యాంగాన్ని రాసుకుని,ఆమోదించి, చట్టబద్ధం చేసుకున్నామని అన్నారు. భారతదేశం సార్వభౌమ రాజ్యంగా మారిందని,గణతంత్ర దినోత్సవం స్వతంత్ర భారతదేశ స్ఫూర్తికి ప్రతీకని,ఇది వలస పాలన నుంచి భారతదేశానికి వచ్చిన స్వాతంత్య్ర ప్రకటన అని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకునే గొప్ప శక్తిని కూడా మన రాజ్యాంగం మనకు కల్పించిందని,నేడు మనందరం రాజ్యాంగం నిర్దేశించిన మౌలిక విలువలకు నిబద్దులమై ఉండాలని కోరారు.

మన రాజ్యాంగ పీఠికలో పొందుపరచిన న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఈ విలువలు మన అందరికీ పవిత్రమైనవని,వీటిని అమలు చేసే వారే కాకుండా ప్రజలందరూ కూడా వాటికి బద్దులై ఉండాలని అన్నారు.రాజ్యాంగ విలువలను మనకు మనం వల్లె వేసుకుంటుండాలని,గణతంత్రం గొప్పతనం చాటి చెప్పేది సమానత్వ భావనే అన్నారు.సాంఘిక సమానత్వం మనందరికీ, గ్రామీణులకు,మహిళలు, సమాజంలోని బలహీనవర్గాలు,ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు,వృద్ధులకు గౌరవం కల్పిస్తుందని,ఆర్థిక సమానత్వం,సమాన అవకాశాలు కల్పిస్తుందని,అణగారిన వర్గాలను చేయిపట్టి నడిపిస్తుందని,తోటి మానవులకు సహాయపడే మన చర్యలు మన సానుభూతి సామర్థ్యాన్ని విస్తృత పరుస్తుందని అన్నారు.

ముందున్న మన ఉమ్మడి మార్గంలో సౌభ్రాతృత్వమే మన నైతిక దిక్సూచి అని, 1948 నవంబర్ 4న,రాజ్యాంగ పరిషత్ లో రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తూ బాబాసాహెబ్ డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ చేసిన ప్రసంగంలో పేర్కొన్న రాజ్యాంగబద్ధ నైతికత మార్గాన్ని మనందరం అనుసరిద్దామని,రాజ్యాంగ బద్ధ నైతికత అంటే రాజ్యాంగంలో ప్రతిష్ఠించిన విలువలే శిరోధార్యమని అర్థమని,ఈ ప్రత్యేకమైన రోజున మన మాతృభూమి యొక్క అద్భుతమైన వారసత్వాన్ని సుసంపన్నం చేయడానికి,సంరక్షించడానికి,దానిని మరింత మెరుగుపరచడానికి మనం చేయగలిగినదంతా చేద్దామని వాగ్దానం చేద్దామని అన్నారు.తమ తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ మనల్ని సురక్షితంగా ఉంచుతున్న సైనికులకు, పోలీసులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తమను తాము ప్రమాదంలో పడేసే ముందు వరుసలో ఉన్న కార్యకర్తలకు,మన గొప్ప మాతృభూమి కీర్తి కోసం కృషి చేస్తున్న ప్రతి భారతీయుడికి డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు కృతజ్ఞతలు తెలిపారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

విజయనగరం లో విచిత్రం..”సత్యం న్యూస్. నెట్ “కు చిక్కిన చిత్రం..

Satyam NEWS

వి బి ఎంటర్టైన్మెంట్స్ యుగపురుషుడు ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌

Bhavani

కరోనా మృతులను కొయ్యడలో దహనం చేయడం ఆపాలి

Satyam NEWS

Leave a Comment