41.2 C
Hyderabad
May 4, 2024 16: 05 PM
Slider గుంటూరు

రైతును ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మ హత్యలే శరణ్యం

ఈ రబీ సీజన్ లో రైతును ఆదుకునే ఏఒక్క పని రాష్ట్రప్రభత్వం చేపట్ట లేదని ఇదే విథానం కొనసాగితే ఆత్మహత్యలే గతి అని TDP రైతువిభాగం నేతలు వాపోయారు. శుక్రవారం తెనాలిలోని TDP కార్యాలయంలో రైతు నాయకుల మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని వర్గాల అణచివేతలు , అరాచకాలు మరీ ముఖ్యంగా రైతులను దగా చేస్తున్నదని టిడిపి రైతు విభాగం నేతలు వాపోయారు. రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటూ వాళ్ల పార్టీ పేరులోనే రైతు ను జోడించి మరి రైతు వెతలను పట్టించుకోకుండా దేశానికి అన్నం పెట్టే రైతులను మరింత అథః పాతాళం లోకి నెట్టే విధంగా వైసీపీ పెద్దలు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల తెలుగురైతు అధ్యక్షులు టి. శ్రీనివాస రావు, గుంటూరు జిల్లా తెలుగు రైతు కార్యదర్శి ముసలయ్య , తెనాలి మండల ఎస్.సి. సెల్ అధ్యక్షులు కోపల్లె శ్రీను, ఎస్.సి. సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కంచర్ల ఏడుకొండలు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యకార్యక్రమంలో కేశన కోటేశ్వర రావు, యడపల్లి రాకేష్, గుమ్మడి ప్రసాద్, కటెవరం గిరి, మల్లవరపు విజయ్, అక్కిశెట్టి వెంకటేశ్వర రావు, బొబ్బిళ్ళపాటి ప్రసాద్, దొప్పలపూడి శ్యామ్,రాజు, భూషణం,రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మిస్ యూజ్: పబ్లిక్ ఏమైతేనేం, ముందు నా ఇల్లు చల్లగా ఉండాలి

Satyam NEWS

దళిత బాలికపై అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలి

Satyam NEWS

గెలిచిన వారి కన్నా.. ఓడిన వారే హైవే వంతెనపై పట్టు వదలలేదు..

Satyam NEWS

Leave a Comment