27.7 C
Hyderabad
May 11, 2024 08: 05 AM
Slider మహబూబ్ నగర్

గెలిచిన వారి కన్నా.. ఓడిన వారే హైవే వంతెనపై పట్టు వదలలేదు..

pjimage

పార్టీలు ఏవైనా, ఆ పార్టీల ఎజెండాలు వేరైనా కానీ నాయకులకు సొంత ఎజెండాలు ఉండాలి.అవే  వారినీ నియోజకవర్గాల్లలో  చిరస్థాయిగా నిలబెడతాయి.అవకాశం వచ్చిందనీ  గంతులు వేస్తే ఒక్కసారికే బోల్తా పడతారు. పార్టీల బలం కాదు.క్యారెక్టర్ బలం నాయకునికి చాలా అవసరం.ఆ పార్టీ,అధికార పార్టీ బాగుంది కదా అని చక్కర్లు కొడితే ప్రజలు కూడా అదే విధంగా చక్కర్లు కొట్టిస్తారు. ఈ అంశం పైన మరోమారు  మాట్లాడుకుందాం…!

రాజకీయ నాయకులకు ఎన్నికలలో గెలుపు, ఓటములు సహజం. కానీ  చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు,నమ్మిన అనుచరులను నాయకులు ఎప్పుడు మరవద్దు…ఎన్నికల అనంతరం ఒడిన నాయకులు  చేసేది ఏం లేకున్నా, గెలిచినోలు ఇచ్చిన హామీలను మరవద్దు.కానీ ఇక్కడ తక్కువ ఓట్లు పొంది ఓటమి అయినా నాయకుడే  ఇచ్చిన హామీనీ నెరవేర్చాడు అంటే నమ్ముతారా..? కానీ ఇక్కడ నమ్మాల్సిందే.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అయినా ఇచ్చిన  హామీ కోసం కృషి

గత 2018 అసెంబ్లీ ఎన్నికల  సమయంలో బీజేపీ పార్టీ నుంచి బరిలోకి దిగిన ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు,కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఎల్లేని  సుధాకర్ రావు గత ఎన్నికల్లో ఓటమి అయినా ఇచ్చిన హామీ కోసం  నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి జరగాలంటే సోమశిల సిద్దేశ్వరం వంతెన, జాతీయ రహదారి నిర్మాణం కావాలి అన్నాడు.అదే నినాదంతో బీజేపీ పార్టీ లోకి వచ్చారు. సోమశిల సిద్దేశ్వరం వంతెన, జాతీయ రహదారి ఎజెండాతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ స్థాపించిన సమయంలోనే  ఎక్కువగా వీటిపైనే మాట్లాడేవారు.కొల్లాపూర్ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షనే   ఆయన ఎజెండా.  ఇప్పుడు అది నెరవేరబోతోంది..

సోమశిల-సిద్దేశ్వరం వంతెన, జాతీయ రహదారికి కేంద్రంతో

కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష సోమశిల- సిద్దేశ్వరం వంతెన  మీదగా జాతీయ రహదారి ఈ ఆకాంక్షపై   కేంద్ర ప్రభుత్వంతోనే ఆయన హామీ ఇప్పించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేను గెలిచిన వెంటనే సోమశిల- సిద్దేశ్వరం వంతెన, జాతీయ రహదారి కొల్లాపూర్ నియోజక వర్గానికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఎన్నికల  ప్రచార సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో హామీ కూడా ఇప్పించారు.అయితే సుధాకర్ రావు ఎన్నికల్లో ఓటమి అయినా కానీ ఆయన ఏనాడు ఇచ్చిన హామీని మరువలేదు.ఆయన అధికారంలోకి రాలేక పోయిన ఆయన నమ్మిన,ఆయనను నమ్మిన బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో వున్నది.

ఈ అభివృద్ధి జరగాలంటే కేంద్రంతోనే సాధ్యం  అవుతుంది కాబట్టిఅందుకే ఆయన ఇచ్చిన హామీల కొరకు ఎన్నో పర్యాయాలు ఢిల్లీకి వెళ్లారు.మంత్రులను కలిశారు. వారి దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా  స్పందనను తీసుకువచ్చారు.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మీదగా కొల్లాపూర్ ప్రాంతానికి 167జాతీయ రహదారి వస్తే జిల్లా అభివృద్ధి చెందుతుంది.

దానితోపాటు అభివృద్ధికి నోచుకోని కొల్లాపూర్ ప్రాంతం  అభివృద్ధి చెందుతుందని ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశం పైన కేంద్ర ప్రభుత్వం  స్పందించింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన జాతీయ రహదారులలో   కల్వకుర్తి మీదగా నంద్యాలకు సోమశిల- సిద్దేశ్వరం వంతెనను కలుపుతూ  జాతీయ రహదారి మంజూరు చేసింది.ప్రస్తుతం తెలంగాణ,నాగర్ కర్నూల్ జిల్లా ప్రాంతంలో జాతీయ రహదారికి  సంబంధించిన టిపిఎఫ్ కంపెనీ సర్వే కూడా పూర్తి అయ్యింది.

ఆంధ్రలో సర్వే చేయాల్సి ఉంది.అంతకముందు సర్వే త్వరగా పూర్తి చేసి డిపిఆర్ ను కేంద్రానికి నివేదిక ఇవ్వాలని ఆర్ అండ్ బీ సూపర్డెంట్ శ్రీనివాస్ ను ఏల్లేని  కోరారు. ఇప్పుడు మొత్తం మీద  ఎల్లేని సుధాకర్ రావు ఎజెండా నెరవేరబోతోంది.కొల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి చందబోతుంది. అందుకే  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్లేని బదులు  హైవే సుధాకర్ రావు అంటున్నారు. వంతెన నిర్మాణ పూజా కార్యక్రమానికి సుధాకర్ రావు కేంద్ర మంత్రులను ఇది వరకే ఆహ్వానించారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

రోడ్ ప్రమాదాల నియంత్రణ కు చర్యలు చేపట్టండి

Satyam NEWS

హంస వాహనంపై కొలువుదీరిన ఆది దంపతులు

Satyam NEWS

భోజనం పెడుతున్నారా..? పాఠాలు చెబుతున్నారా..? అర్ద‌మ‌వుతోందా..?

Satyam NEWS

Leave a Comment