42.2 C
Hyderabad
May 3, 2024 17: 21 PM
Slider ఖమ్మం

అల్లాహ్ అందరినీ చల్లగా చూస్తారు: మంత్రి పువ్వాడ

#puvvada

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని 23వ డివిజన్ ముస్తఫా నగర్ మజీద్ నందు 23వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మక్బుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరైయ్యారు.ఈ సందర్భంగా ఉపవాసం ఆచరిస్తున్న ముస్లిం సోదరులకు ఖజ్జూరాలు, పండ్లు తినిపించి ఈరోజు దీక్షను విరమింపజేశారు. అనంతరం వారితో పాటు మంత్రి పువ్వాడ నమాజును ఆచరించి, దువా చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం ప్రజలంతా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటాను అన్నారు. భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసం చేస్తారని అన్నారు. ఖమ్మం ప్రజల బాగు కోసమే తాను ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉన్నానని, ఉంటానని పేర్కొన్నారు.

ఈపవిత్ర రంజాన్ మాసంలో ఖమ్మం ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో వుండాలని అల్లాహ్ ను వేడుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముస్తఫా నగర్ మస్జీద్ కమిటీ సదర్ సాహెబ్ అబ్ధుల్ రహమాన్, కమిటీ సభ్యులు ఇబ్రహీం, ఇషాక్, ఇస్మాయిల్, సలీం, సత్తార్, మహమ్మద్ ఆలీ, టిఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్, ఆశ్రీఫ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, పగడాల నాగరాజు, ఇలియాజ్, సోహెల్, తాజుద్దీన్,  నర్సింహారావు, జునైద్, ముజ్జు, అజీజ్, శేఖర్, అజ్జూ, జర్నలిస్ట్ జాని తదితరులు ఉన్నారు.

Related posts

చంద్రబాబు వేలుకు ఉంగరం…. ఎందుకో వివరించిన అధినేత

Satyam NEWS

నరసరావుపేటలో వైభవంగా కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ఠ

Satyam NEWS

గుడ్ బై: సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment