42.2 C
Hyderabad
May 3, 2024 16: 43 PM
Slider ఖమ్మం

ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు పక్డబందీగా నిర్వహించాలి

#10thexams

ఖమ్మం జిల్లాలో ఓపెన్‌ ఇంటర్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఎన్‌. మధుసూదన్‌ అన్నారు. ఐడిఓసి అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో అధికారులతో అదనపు కలెక్టర్‌ తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం, హైద్రాబాదు వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్‌ ఇంటర్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం పరీక్షలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లాలో 25 ఏప్రిల్‌ నుండి 04 మే 2023 వరకు ఓపెన్‌ ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఓపెన్‌ ఇంటర్‌కు సంబంధించి 1278 మంది, పదవ తరగతి పరీక్షలకు ,817 మొత్తం 2095 మంది బాల, బాలికలు పరీక్షలు రాయనున్నట్లు, వీటి నిర్వహణకు 10 పరీక్షా కేంద్రాలను 10 వ తరగతి పరీక్షలకు 4 ఇంటర్మీడియట్ పరీక్ష లకు 6 ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. థీయరీ పరీక్షలకు ఉ. 9.00 నుండి మ.12.00 గంటల వరకు మరియు మధ్యాహ్నము 02.30 నుండి 05.30 వరకు ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ తేది.12-5-2023 నుండి 19-05-2023 వరకు జరుగుతాయన్నారు.

పరీక్షా కేంద్రానికి పరీక్ష ప్రారంభానికి 30 నిమిషముల ముందు నుండి అనుమతించబడుతుందన్నాని, పరీక్ష ప్రారంభమైన తరువాత పరీక్షా కేంద్రము నుండి పరీక్ష ముగిసే సమయం వరకు ఏ అభ్యర్దిని బయటకు అనుమతించబడరని తెలియజేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మౌళిక వసతులు ఏర్పాట్లు చేయాలని, వేసవి దృష్టా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రతి కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, ఓ.అర్‌.ఎస్‌. ప్యాకెట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు.

జిల్లాలో పరీక్ష ప్రశ్నపత్రాలను నిల్వచేయుటకు పోలీస్‌ స్టేషన్లలో తగిన ఏర్పాట్లు చేయాలని, పటిష్ట బందోబస్తు చేపట్టాలని ఆయన అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సెంటర్లలో మాస్‌ కాపీయింగ్‌, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని ఆయన అన్నారు. ప్లైయింగ్‌ స్వ్వాడ్‌ ఏర్పాటు చేసి పరీక్ష జరుగుతున్న తీరుపై నిఘా వుంచాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్‌ సెంటర్లు మూసివేయించాలని ఆయన అన్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద మంచి నీరు, ఫ్యాన్లు, లైట్లు సరిఅయిన విధంగా వుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పరీక్ష నిర్వహణ అనంతరం సమాధాన పత్రాలను పోస్టల్‌ ద్వారా తరలించే ప్రక్రియ సజావుగా చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ సహాయ సంచాలకులు ఎం.వి.చారీ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డా. బి. మాలతి, డి.సి.టి.ఓ ఎస్‌ఎస్‌ ఎం.పాపారావు, పోలీసు, పోస్టల్‌, విద్యుత్‌ శాఖ, ఆర్‌.టి.సి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మూడు రాజధానులా? మూడు రాష్ట్రాలా? సీఎం తేల్చుకోవాలి

Satyam NEWS

రన్ రాజా రన్: ముందుగా మూడింది ఉప శాఖలకు

Satyam NEWS

వనపర్తి జిల్లాలో కరోనా నియంత్రణకు సర్వే

Satyam NEWS

Leave a Comment