38.7 C
Hyderabad
May 7, 2024 15: 30 PM
Slider నిజామాబాద్

సమస్యలను లేవనెత్తే ఏకైక లీడర్ షర్మిల

#satyavati

మొద్దు నిద్రలో ఉన్న కేసీఆర్ సర్కారులో సమస్యలను లేవనెత్తే ఏకైక లీడర్ వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యవతి అన్నారు. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం కామారెడ్డికి వస్తున్న సందర్బంగా జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్టిపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందన్నారు.

మొద్దు నిద్రలో ఉన్న సర్కారును మేల్కొలపడానికే వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 173 రోజులుగా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు 2400 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగిందని తెలిపారు. రేపు పాదయాత్ర కామారెడ్డికి చేరుకుంటుందన్నారు. 5 రోజుల పాటుగా జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఏ ఆశయాలతో తెలంగాణ సాద్జించుకున్నామో నేడు ఆ ఆశలు మరుగున పడిపోయాయన్నారు.

అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని తెలిపారు. తెలంగాణలో రైతుల పట్ల సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఇక్కడ చనిపోయిన రైతు కుటుంబాలకు అండగా నిలవకుండా వేరే రాష్ట్రంలో చనిపోయిన రైతులకు చెక్కులను పంపిణీ చేస్తున్నారని దుయ్యబట్టారు. చేతకాని, చేవ చచ్చిన సీఎం మనకు ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన తేవడం కోసం వైఎస్ షర్మిల పాదయాత్ర చేపడుతున్నారని, ఈ పాదయాత్రలో వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

పాదయాత్ర విజయవంతం చేయాలి

కామారెడ్డి జిల్లాలో 5 రోజుల పాటు సాగే వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతం చేయాలని వైఎస్ఆర్టిపి జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్ కోరారు. రేపు సాయంత్రం 3:50 నిమిషాలకు సిరిసిల్ల రోడ్డులోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. సిరిసిల్ల రోడ్డు నుంచి ధర్మశాల, రైల్వే స్టేషన్, నిజాంసాగర్ చౌరస్తా, దేవునిపల్లి మీదుగా లింగాపూర్ వరకు కొనసాగుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఇందిరా చౌక్ వద్ద ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగిస్తారని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

షర్మిల పాదయాత్ర షెడ్యూల్

కామారెడ్డి జిల్లాలో 5 రోజుల పాటు సాగే వైఎస్ షర్మిల పాదయాత్ర ఈ విదంగా కొనసాగనుంది. శనివారం జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు నుంచి పాత బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, దేవునిపల్లి మీదుగా లింగాపూర్ వరకు సాగనుంది. ఆదివారం ఉదయం లింగాపూర్ నుంచి మొదలై కృష్ణాజివాడి, తాడ్వాయి మీదుగా ఎర్రపహాడ్, లింగంపేట మండలం ఒంటరిపల్లి వరకు సాగనుంది.

సోమవారం ఒంటరిపల్లి నుంచి లింగంపేట మండల కేంద్రం మీదుగా ఎల్లారెడ్డి పట్టణానికి చేరుకుంటుంది. ఎల్లారెడ్డి పట్టణం వరకు 2500 కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్బంగా ఎల్లారెడ్డి పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని అవిష్కరించనున్నారు. మంగళవారం ఎల్లారెడ్డి నుంచి మొదలై నిజాంసాగర్ మండలం హాసన్ పల్లి, నిజాంసాగర్, పిట్లం వరకు సాగనుంది. బుధవారం పిట్లం నుంచి బిచ్కుంద మండలం బండరాంజల్ వరకు, చివరి రోజు గురువారం నాడు బండరాంజల్ నుంచి బిచ్కుంద మండల కేంద్రం వరకు పాదయాత్ర కొనసాగనుంది. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగనుంది.

పార్టీలో చేరిన వారికి కండువా వేస్తున్న నీలం రమేష్

Related posts

జగన్ లేఖ ను ఖండించిన ఆలిండియా బార్ అసోసియేషన్

Satyam NEWS

సత్యం న్యూస్ చెప్పినట్టు.. ఉత్తరాంధ్ర లో కమ్మేసిన కారు మబ్బులు…!

Satyam NEWS

హోంగార్డు అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్

Murali Krishna

Leave a Comment